అన్వేషించండి

Best Sci Fi Movies On OTT: ఆకాశంలో వింత శబ్దాలు, పైకి చూసేవాళ్లంతా మాయం - వెరైటీ హర్రర్ కావాలంటే ఈ మూవీ చూడాల్సిందే!

Movie Suggestions: సైన్స్ ఫిక్షన్ కథలు అసలు అర్థం కావు. అవి చూడాలంటే చాలా కష్టమని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ వాటన్నింటికి భిన్నంగా ఒక సింపుల్ సైన్స్ ఫిక్షన్ కథ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Best Sci Fi Movies On OTT: సైన్స్ ఫిక్షన్ సినిమాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడంలో హాలీవుడ్ దిట్ట. ముఖ్యంగా ఏలియన్స్ లాంటి కథలను హాలీవుడ్ మేకర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తారు. అలాంటి ఒక సినిమానే ‘నోప్’ (Nope Movie). అత్యాశకు పోతే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే నిజంగానే మనిషికి అవసరం ఉంటే కష్టానికి తగిన ఫలితం ఎలా లభిస్తుంది? లాంటి అంశాలపై ‘నోప్’ ఆధారపడి ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా కూడా ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఈ మూవీ ఉంటుంది. అందుకే చాలావరకు ఓటీటీ సబ్‌స్క్రైబర్ల నుంచి దీనికి పాజిటివ్ రివ్యూలు లభించాయి.

కథేంటీ?

కాలిఫోర్నియాలోని ఒక పల్లెటూరిలో ఓజే (డేనియల్ కలూయా), తన తండ్రి, చెల్లెలు ఎమరాల్డ్ (కేకే పాల్మర్)తో కలిసుంటాడు. ఈ కుటుంబమంతా గుర్రాలను పెంచుకుంటూ, వాటిని హాలీవుడ్ సినిమాల షూటింగ్స్‌కు రెంట్స్‌కు ఇస్తూ జీవిస్తుంటారు. ఒకరోజు ఓజే, తన తండ్రి కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎవరో అరుస్తున్నట్లు ఆకాశం నుంచి శబ్దాలు వస్తాయి. ఏంటా అని ఇద్దరు పైకి తలెత్తి చూస్తారు. ఆ వెంటనే నాణెల వర్షం పడుతుంది. అవి బుల్లెట్లలా దూసుకొస్తాయి. వాటిలో ఒకటి ఓజే తండ్రి కంటి నుంచి తలలోకి దూసుకెళ్తుంది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోతాడు. 

తండ్రి మరణించిన తర్వాత ఓజే, తన సోదరి ఎమరాల్డ్ కలిసి గుర్రాలను రెంట్స్‌కు ఇచ్చే వ్దయాపారాన్ని కొనసాగిస్తుంటారు. ఒకరోజు గుర్రాన్ని షూటింగ్‌కు ఇవ్వగా అది అందరినీ ఇబ్బందిపెట్టడంతో, దాని తర్వాత వారి వ్యాపారం డల్ అయిపోతుంది. అదే సమయంలో అదే ప్రాంతంలో ఉండే జూప్స్ (స్టీవెన్ యూన్) అనే వ్యక్తి థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేసి రెండు చేతులా డబ్బులు సంపాదిస్తుంటాడు. వేరే దారిలేక తన గుర్రాన్ని జూప్స్‌కు అమ్మేస్తాడు ఓజే.

ఆ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఆకాశంలో ఒక వింత ఆకారాన్ని గమనిస్తుంటారు ప్రజలు. ఆ ఆకారం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులేవీ పనిచేయవు. ఇదే విషయాన్ని ఓరోజు ఓజే, ఎమరాల్డ్ మాట్లాడుకుంటూ ఉండగా.. ఆ ఆకారం ఒక గ్రహంతరవాసి అయ్యిండవచ్చని ఎమరాల్డ్‌కు అనుమానం వస్తుంది. దానిని ఫోటోలు తీసి, మీడియాకు ఇస్తే వారికి చాలా డబ్బులు వస్తాయని ఆశపడుతుంది. ఆ ప్లాన్‌కు ఓజే కూడా ఒప్పుకుంటాడు. దానికోసం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తారు. అదే సమయంలో జూప్స్ ఏర్పాటు చేసిన థీమ్ పార్క్‌లోని మనుషులను ఆ ఏలియన్ తినేస్తుంది. కానీ అక్కడ బెలూన్లను మాత్రం తినకుండా వదిలేస్తుంది. ఇదే విషయాన్ని గమనించిన ఓజే, ఎమరాల్డ్ ఆ ఏలియన్ నుంచి ఎలా తప్పించుకుంటారు. వారు ఏం చేస్తారనేది తెరపైనే చూడాలి. ఈ మూవీ Netflixలో అందుబాటులో ఉంది. హిందీలో చూడవచ్చు.వద

సింపుల్ సైన్స్ ఫిక్షన్ కథ..

‘నోప్’లో చాలా తక్కువమంది నటీనటులు ఉంటారు. కానీ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ రూపంలో తిరిగే గ్రహాంతర వాసిని ఫోటో తీయడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ అస్సలు బోర్ కొట్టకుండా, చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. జోర్డన్ పీల్ తెరకెక్కించిన ఈ మూవీ 2022లో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ను సాధించింది. ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని ఇంత సింపుల్‌గా తెరకెక్కించవచ్చని ‘నోప్‌’తో నిరూపించాడు జోర్డన్. ఒక సింపుల్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘నోప్’ను ఓ లుక్కేయండి.

Also Read: ఆ స్మైల్ చూస్తే చావు దగ్గరపడినట్లే - తప్పించుకోవడం అంత ఈజీ కాదు, నవ్వుతూ చంపేయడమంటే ఇదే కాబోలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget