అన్వేషించండి

Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ ఓటీటీ రిలీజ్ అప్ డేట్, స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.

Ambajipeta Marriage Band OTT Release Update: ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. క్రిటిక్స్‌ నుంచి కూడా ప్రశంసలు అందుకున్న సినిమా. క‌లెక్ష‌న్స్ లో కూడా టాప్ లోనే నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. ఓటీటీలో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? ఏ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందా? అని అనుకుంటుండ‌గా.. గుడ్ న్యూస్ చెప్పింది 'ఆహా'. 'క‌మింగ్ సూన్' అంటూ ట్వీట్ చేసింది. 

మార్చి 1న రిలీజ‌య్యే అవ‌కాశం?

'క‌మింగ్ సూన్' అని మాత్ర‌మే ట్వీట్ చేసింది 'ఆహా'. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క‌చ్చితంగా చెప్ప‌లేదు. అయితే, మార్చి 1న ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ గా మారింది. 

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టిన నటుడు సుహాస్‌. హీరోగా కూడా మంచి గుర్తింపు పొందాడు. 'కలర్‌ ఫొటో', 'రైటర్‌ పద్మభూషణ్‌' లాంటి సినిమాల్లో న‌టించాడు. అవి కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. హిట్ కొట్టాయి. హీరోగా మాత్ర‌మే కాదు.. నెగిటివ్‌ రోల్స్‌లోనూ మెప్పించాడు సుహాస్. 'హిట్‌: ది సెకండ్‌ కేసు'లో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు ఈ యాక్ట‌ర్. మరోవైపు హీరోలకు స్నేహితుడి పాత్ర‌ల్లో కూడా అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్‌ హీరోగా నటించిన సినిమా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఈ సినిమాని దుశ్యంత్ కటికినేని డైరెక్ట్ చేశాడు. శివాని నాగరం హీరోయిన్. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. 

ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ మంచి టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. క‌లెక్ష‌న్స్ విష‌యంలో కూడా దూసుకెళ్లింది. ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.2.28 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఒక చిన్న హీరో సినిమా ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో వసూళ్లు రాబ‌ట్టం సాధారణ విషయం కాదు అంటూ గ‌తంలో సినిమా టీమ్ ప్ర‌క‌టించింది.

ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొన‌సాగించింది. ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచే భారీగా అంచ‌నాలు పెరిగాయి. ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీ కాకుండా రిలీజైన టైంలో.. థియేట‌ర్ల‌లో సినిమాలు కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డం, పెద్ద సినిమాల సందడి, ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్‌ మరింత పెరిగాయ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించారు. విలేజ్ డ్రామాలో సోషల్ మెసేజ్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు దుశ్యంత్. ఈ సినిమాలో సుహాస్ అక్క‌గా న‌టించిన ఫిదా ఫేమ్ శ‌ర‌ణ్య‌, హీరోయిన్‌గా నటించిన శివానీ పర్ఫార్మెన్స్‌లు కి కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. వీరి న‌ట‌న బాగుంది అంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

Also Read: బేబీ బంప్‌తో భూమా మౌనిక - మంచు మనోజ్ లవ్లీ రిప్లై

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Thaai Kizhavi OTT : ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Rakasa OTT : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget