అన్వేషించండి

Adipurush: మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్' - టీజర్ చూసి సినిమాను గెస్ చేయలేరు: ఓంరౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఏబీపీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' గురించి మాట్లాడారు దర్శకుడు ఓం రౌత్.

ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు. 

ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బతీసేలా 'ఆదిపురుష్' మూవీ సీన్స్ ఉన్నాయని ఈ సినిమాపై కోర్టులో కేసులు పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించారు దర్శకుడు ఓం రౌత్. ఏబీపీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' గురించి మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం రామాయణం ఆధారంగా తీసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ చూశానని.. మన పురాణాల గురించి తెలియని ఎవరో అలాంటి సినిమా తీసినప్పుడు మనమెందుకు తీయకూడదనే ఆలోచనతో 'ఆదిపురుష్'ని తెరకెక్కించినట్లు చెప్పారు ఓం రౌత్. 

మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్':

ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేటి జెనరేషన్ కి అర్ధమయ్యేలా తీయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రామాయణాన్ని చాలా కోణాల్లో తెలుసుకున్నానని.. అయితే ఈ జెనరేషన్ వారికి మార్వెల్స్, హ్యారీ పోటర్ వంటి సినిమాలు బాగా కనెక్ట్ అవుతుండడంతో.. అది దృష్టిలో పెట్టుకొని 'ఆదిపురుష్' తీసినట్లు చెప్పారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీయలేదని.. మోడర్న్ పెర్స్పెక్టివ్ లో సినిమా తీశానని అన్నారు. 

టీజర్ చూసి సినిమాను గెస్ చేయలేరు:

ఈ సినిమాకి రైటర్ గా పని చేసిన ముంతాషీర్ శుక్లా కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. టీజర్ చూసిన వారిలో కొందరు రావణ గెటప్ గురించి ప్రశ్నిస్తున్నారని.. అతడు రావణుడు కంటే ఖిల్జీ మాదిరి ఉన్నారని చెబుతున్నారని అన్నారు. తన దృష్టిలో రావణుడు అంటే రాక్షసుడని.. చాలా క్రూరుడని దానికి తగ్గట్లే సినిమాలో అతడి లుక్ ఉంటుందని అన్నారు. కొందరు రావణుడిని శివ భక్తుడని, పండితుడని అంటుంటారని.. కానీ తన దృష్టిలో సీతాదేవిని ఎత్తుకుపోయిన రాక్షసుడని అన్నారు శుక్లా. ఒక్క టీజర్ చూసి సినిమా స్టోరీ ఊహించలేరని.. జనవరిలో సినిమా మొత్తం చూసిన తరువాత జనాల ఒపీనియన్ మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. 

హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Rajamouli : సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!
సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget