అన్వేషించండి

Director Sujeeth: 'ఓజీ'కి అర్థం చెప్పిన డైరెక్ట‌ర్ సుజీత్.. టీజ‌ర్, ట్రైల‌ర్ చింపేస్తాం

Director Sujeeth:ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న సినిమా.‘ఓజీ’. ఈ సినిమా గురించి, టైటిల్ గురించి దర్శకుడు సుజీత్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

Director Sujeeth About Pawan Kalyan & OG Movie : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, సుజీత్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ప్రొడ్యూస‌ర్. ఈ సినిమాకి సంబంధించి ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు భారీ అంచ‌నాలు ఉన్నాయి. కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ డిఫ‌రెంట్‌గా క‌నిపించ‌నున్నారు. ఒక గ్యాంగ్ స్ట‌ర్‌గా ఆయ‌న క‌నిపించనున్నారు. దీంతో ఫైట్స్, ఫీట్స్ ఉంటాయ‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదీ కాకుండా డైరెక్ట‌ర్ సుజీత్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. దీంతో ఒక ఫ్యాన్ త‌మ హీరోని ఎంత‌బాగా చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంద‌రూ. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు సుజీత్. ఈ సంద‌ర్భంగా 'ఓజీ' అంటే ఏంటో చెప్పారు. 

ఒక్క లైన్ చెప్పాను అంతే.. 

'ఓజీ'.. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చింది. సెప్టెంబ‌ర్ 27న సినిమా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు డైరెక్ట‌ర్ సుజీత్. ఒక్క లైన్ చెప్ప‌గానే క‌ల్యాణ్ గారు ఓకే చెప్పేశార‌ని అన్నారు. "ఓజీ' కూడా రీ మేక్ అన్నారు. అలా అనే న‌న్ను పిలిచారు. కానీ, ఒక్క ఒరిజిన‌ల్ సినిమా, డైరెక్ట్ గా తీస్తే ఆ కిక్కే వేరు క‌దా. అందుకే నేను మాత్రం ఒక్క ఛాన్స్ దేవుడా అని అనుకున్నాను. నేచ‌ర్ మ‌న‌కి కో - ఆప‌రేట్ చేస్తుంది అంటారు క‌దా. అలా ల‌క్కీగా.. ఏదైనా కొత్త క‌థ ఉందా అని అడిగారు. ఒక లైన్ చెప్పాను క‌ల్యాణ్ గారికి. వెంట‌నే ఓకే అన్నారు. నా మీద జ‌ప‌నీస్ సినిమా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. క‌ల్యాణ్ గారికి కూడా జ‌ప‌నీస్ సినిమాలు చాలా ఇష్టం. క‌ల్యాణ్ గారి కొడుకు పేరు ఎక్క‌డెక్క‌డో వెతికి పెట్టుకున్నారు. అలా ఇద్ద‌రం క‌నెక్ట్ అయ్యాం" అని చెప్పారు సుజీత్. 

'ఓజీ' అంటే అర్థం ఇదే.. 

'ఓజీ'లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్ పేరు ఏంటో లీక్ చేశారు సుజీత్. ఓజీ అంటే ఓజ‌స్ గంభీర అని అన్నారు. 'ఓజ‌స్' అంటే మాస్ట‌ర్ అని, 'గంభీర' అనేది హీరో పేరు అని చెప్పారు.ఆయ‌న సినిమాలో మాస్ట‌ర్ అని అన్నారు. ఇక 'ఓజీ' అంటే ఒరిజిన‌ల్ గ్యాంగ‌స్ట‌ర్ అనే అర్థం క‌డా వ‌స్తుంద‌న్నారు సుజీత్. 

ఆయ‌నతో అలా సినిమా తీయాలి అనుకున్నాను.. 

"ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి మీద జ‌ప‌నీస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఆయ‌న సినిమాలో అలాంటివి ఉండాలి అనుకున్నాను. నేను ఆయ‌న వేరే సినిమాలు చూశాను. సాంగ్స్ లో పెడుతుంటారు. అవ‌స‌రం లేక‌పోయినా ఆయ‌న్ని ఇన్ కార్పొరేట్ చేస్తుంటారు అన‌మాట. జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తారు క‌దా. దాన్ని రిలేట్ చేసుకున్నాను. స్టోరీని లింక్ చేసుకున్నాను. దాన్ని జ‌నాలు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు అనిపించింది నాకు. ఇక టీజ‌ర్ అన్ని కూడా మ‌నం ఇర‌గ‌దీశాం. ట్రైల‌ర్ క‌ట్ కూడా అయిపోయింది. సినిమా ముందు రిలీజ్ అవుతుంది క‌దా.. చింపేస్తాం. నేను కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ప‌వ‌న్ కల్యాణ్ ని కొత్త‌గా చూస్తున్నాం క‌దా" అని సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు సుజీత్. సుజీత్ మాట‌లు విన్న ఫ్యాన్స్ అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. "వెయిటింగ్ ఇక్క‌డా" అంటున్నారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.  

Also Read: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్

టాప్ హెడ్ లైన్స్

Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget