Watch Video: చుడీదార్ పరువు తీస్తున్నావ్ అంటూ నటిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, వీడియో చూడండి
ఉర్ఫి జావేద్ హోలీ రోజున వేసుకున్న డ్రెస్ వివాదాస్పదంగా మారింది.

బాలీవుడ్ నటి ఉర్ఫి జావేద్ డ్రెస్సింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్స్ పోజింగ్ చేయడంలో ఆమె తరువాతే ఎవరైనా. హిందీ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఆమె చాలా ఫేమస్ అయింది. వస్త్రాధారణతో మరింత పాపులర్ గా మారింది ఉర్ఫి. ఆమె చిత్రవిచిత్ర డ్రెస్సులను ఫోటోలు తీసేందుకు ఎప్పుడూ బాలీవుడ్ కెమెరాలు సిద్ధంగా ఉంటాయి. ఉర్ఫి హోలీ పండుగను కూడా వదల్లేదు. ఆ పండుగ నాడు రంగులు చల్లుకునేందుకు ప్రత్యేకంగా ఓ డ్రెస్సును డిజైన్ చేయించుకుంది. పేరుకు చుడీదారే అయినా శరీరం బయటకి కనిపించేలా కుట్టించింది. ఆ డ్రెస్‌ను చూసి నెటిజన్లకు ఒళ్లు మండింది. పండుగ రోజూ ‘ఎక్స్ పోజింగ్ అవసరమా’ అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ‘ఈమె ఇక మారదు’ అని, ‘చుడీదార్‌ని కూడా ఇలా ధరించి ఆ డ్రెస్ గౌరవాన్ని తగ్గిస్తున్నావ్’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఎవరు ఎన్ని అన్నా ఉర్ఫి జావేద్ పట్టించుకోదు. ఆమెకు కావాల్సింది పాపులారిటీ. డ్రెస్‌ల వల్ల ఆమెకు బోలెడంత పాపులారిటీ వస్తోంది. అందుకే డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం ఆమె మార్చేది లేదని, తన డ్రెస్ తన ఇష్టమని గతంలో కూడా చాలా సార్లు తెగేసి చెప్పింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Before You Go
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















