అన్వేషించండి

సిద్ధార్థ్ 'టక్కర్' స్ట్రీమింగ్ హక్కులు ఆ ఓటీటీకే!

కార్తీక్ జి క్రిష్ రచన, దర్శకత్వం వహించిన టక్కర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందన్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను స్టార్ నెట్వర్క్ కొనుగోలు చేసినట్టు కూడా ప్రచారం సాగుతోంది

Takkar : 'బొమ్మరిల్లు', నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్.. మనోహరమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేటెస్ట్ చిత్రం 'టక్కర్'.. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జూన్ 9న ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని వార్తలు వినిపస్తున్నాయి. టక్కర్ శాటిలైట్ హక్కులను స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసినట్టు సమాచారం. కార్తీక్ జి క్రిష్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించింది.

టక్కర్ సినిమాలో సిద్దార్థ్, దివ్యాశ కౌశిక్ తో పాటు అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. టక్కర్‌ను ప్యాషన్ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించారు.

పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో నటించాలనే తన కల టక్కర్ సినిమాతో నెరవేరిందని హీరో సిద్దార్ధ్.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ఇది మంచి యాక్షన్ ఫిల్మ్ అన్న ఆయన.. అందులోనే ఓ లవ్ స్టోరీని యాడ్ చేశామన్నారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా థియేటర్ కు వెళ్లి చూడాలని కోరారు. యుక్త వయసులోనే లెజెండ్స్ తో కలిసి పని చేయడం దేవుడు తనకిచ్చిన వరంగా సిద్ధార్థ్ అభివర్ణించారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనకిచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆయన తనయులు సురేష్ బాబు, వెంకటేష్ గారి ప్రోత్సాహం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేశ్ బాబు, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, వెంకటేశ్ మహా, తరుణ్ భాస్కర్ తదితరులు అతిథులుగా హాజరై సినిమా మంచి విజయం సాధించిన ఆకాంక్షించారు.

ఇటీవలే 'టక్కర్' సిరీస్ ఎపిసోడ్‌ 1 వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్‌ వర్సెస్‌ రియాలిటీ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో హెయిర్‌ సెలూన్‌లో జరిగే ఫన్ ట్రాక్‌తో సాగుతోంది. ఈ వీడియోతో డైరెక్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్‌ అయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 'టక్కర్‌' నుంచి విడుదల అయిన టీజర్‌తో పాటు 'కయ్యాలే' వీడియో సాంగ్‌, 'ఊపిరే' లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా ఓ పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతున్నట్టు సమాచారం. మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also : సాయిపల్లవి సీతగా మరో ‘రామాయణం’ - కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోస్, కానీ..

Read Also : Arthamainda Arun Kumar : ఓ కార్పొరేట్ బానిస కథ - ఆహా నుంచి 'అర్థమైందా అరుణ్ కుమార్'

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Twitter Review - రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
Jagadhatri Serial Today October 15: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
జగద్ధాత్రి సీరియల్: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget