అన్వేషించండి
Advertisement
NBK107: కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సినిమా షూటింగ్ - మాస్ సీన్స్ లోడింగ్!
బాలయ్య సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను కర్నూలులో మొదలుపెట్టబోతున్నారు.
నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను కర్నూలులో మొదలుపెట్టబోతున్నారు. కర్నూలు సెంటర్ కొండారెడ్డి బురుజు వద్ద సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలానే మౌర్య హోటల్ సెంటర్ వద్ద కూడా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ నిలుస్తాయని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు శృతి, దునియా విజయ్ కూడా పాల్గోనున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
సినిమా
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement