Nayanthara: నయనతార కొత్తిల్లు - ఇంటీరియర్ డిజైన్ కోసం రూ.25 కోట్ల ఖర్చు!
చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఓ ఇంటిని కోలుగోలు చేసిందట నయనతార.
![Nayanthara: నయనతార కొత్తిల్లు - ఇంటీరియర్ డిజైన్ కోసం రూ.25 కోట్ల ఖర్చు! Nayanthara spent a whopping amount on the interior of her Poes Garden house in Chennai Nayanthara: నయనతార కొత్తిల్లు - ఇంటీరియర్ డిజైన్ కోసం రూ.25 కోట్ల ఖర్చు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/05/affdf0426022b05592300e4ca3842a991657017045_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ కి వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసిన తరువాత తిరిగి ఇండియాకు వచ్చారు. వచ్చేరాగానే తన సినిమా షూటింగ్ లో పాల్గొంది నయనతార. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నయన్-విఘ్నేష్ తన కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నారు.
చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఓ ఇంటిని కోలుగోలు చేసిందట నయనతార. పోయెస్‌గార్డెన్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు నివసిస్తుంటారు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో కూడా ఉండేది అక్కడే. ఇప్పుడు నయనతార కూడా అదే ఏరియాలో ఇల్లు కొనుక్కుంది. తన భర్త విఘ్నేష్ తో కలిసి కొత్తింటికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. నయనతార కొన్న ఈ ఇల్లు దాదాపు 8000 చదరపు అడుగుల స్థానంలో ఉంటుందని సమాచారం.
ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్స్ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసే ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.25 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతుందట నయనతార. ఈ ఇంట్లో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్‌శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నయన్-విఘ్నేష్ ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)