News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahesh Babu Namrata Anniversary: 18 ఏళ్ల క్రేజీ లవ్ - మహేష్, నమ్రతాల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌ ను వివాహం చేసుకుని నేటితో 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తొచ్చే కొద్ది మంది జంటల్లో నమ్రత మహేష్ జంట ఒకటి. అంతలా ఈ జంట అందర్నీ ఆకట్టుకుంటారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు నమ్రత మహేష్. వీరి ప్రేమకు ప్రతిరూపంగా గౌతమ్, సితార జన్మించారు. ఫిబ్రవరి 10న వీరి వివాహ వార్షికోత్సవం. ఫిబ్రవరి 10, 2023 నాటికి వీరి వివాహం జరిగి సరిగ్గా 18 ఏళ్లు గడించింది. ఈ నేపథ్యంలో మహేష్-నమ్రతలు ఒకరికొకరు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మహేష్ బాబు తన ఇన్‌స్టాలో నమ్రతతో ఉన్న ఓ పాత ఫోటోను షేర్ చేసి విషెస్ చెప్పగా.. నమ్రత మహేష్ బాబుతో దిగిన ఓ రేర్ ఫోటోను షేర్ చేసి మహేష్ కు విషెస్ తెలిపింది. ఈ ఫోటోలు చూసి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. ‘‘మీ జంట ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము’’ అంటూ మరికొంత మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతన్నాయి. 

ప్రేమ నుంచి పెళ్లి బంధంలోకి ఇలా..

సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించి తర్వాత నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన జంటల్లో నమ్రత మహేష్ జంట ఒకటి. అసలు వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే.. మహేష్, నమ్రత కలసి ‘వంశీ’ సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్‌‌ లో జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది మంచి స్నేహంగా మారింది. తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మహేష్‌కు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నమ్రాతానే. మహేష్‌కు కూడా ఆమె అంటే ఇష్టం ఉండటంతో ఆలస్యం చేయకుండా ఒకే చెప్పేశారట. అలా దాదాపు నాలుగేళ్లు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పారట. మహేష్ కుటుంబం మొదట్లో కాస్త బెట్టు చేయడంతో ఆయన సోదరి మంజుల వారిని ఒప్పించిందట. అలా ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి సింపుల్ గా 2005 లో ఫిబ్రవరి 10న జరిగింది. 

మహేష్-నమ్రతల పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటుందీ జంట. అందుకే వీరిని కూల్ కపుల్ గా పిలుస్తుంటారు. బయట పెద్దగా కనిపించకపోయినా అప్పుడప్పుడూ వెకేషన్స్ లో లేదా ప్రత్యేక సందర్భాలలో ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతుంటారు. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సితార ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

మహేష్ సినిమాల విషయానికొస్తే..

ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాలో చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో కలసి ఓ భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు. 

Also Read : 'పాప్ కార్న్' రివ్యూ : ప్రేమ కథకు డైపర్ వేశారుగా - అవికా గోర్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Mahesh Babu (@urstrulymahesh)

View this post on Instagram
 
A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Published at : 10 Feb 2023 06:00 PM (IST) Tags: Mahesh Babu namrata Namrata Shirodkar Namrata-Mahesh anniversary

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత