Thandel Working Stills: శరవేగంగా ‘తండేల్’ షూటింగ్- వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన చిత్రబృందం!
నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ స్టిల్స్ ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది.
Thandel Movie Shooting: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించగా, ఇప్పుడు ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది.
‘తండేల్’ మూవీ వర్కింగ్ స్టిల్స్ విడుదల
శ్రీకాకులం జిల్లాకు చెందిన పలువురు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లి, పాకిస్తాన్ అధికారులు పట్టుబడుతారు. వాళ్లు తిరిగి ఇండియాకు ఎలా వచ్చారు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య చేపలు పట్టే యువకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్ ను మేకర్స్ నెటిజన్లతో పంచుకున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈస్టిల్స్ లో కనిపించారు. ఓ ఫోటోలో సినిమాకు సంబంధించి తీయబోయే సీన్స్ గురించి చందు మొండేటి నాగ చైతన్యతో పాటు అల్లు అరవింద్ కు వివరించే సెటప్ కనిపిస్తోంది. మరో ఫోటోలో దర్శకుడు ఏదో చెప్తుంటే సాయి పల్లవి నోట్స్ రాసుకుటుంది. మరో ఫోటోలో ఓ చిన్న పాపను ఒళ్లో పెట్టుకుని నవ్వుతూ కూర్చుంది సాయిపల్లవి. రైల్వే స్టేషన్ సెటప్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Intense, passion-filled and fun ❤️🔥
— Geetha Arts (@GeethaArts) March 22, 2024
Some shoot diaries from the sets of #Thandel 💥
Shooting in full swing. Exciting updates soon ✨#Dhullakotteyala 🔥🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas @_riyazchowdary… pic.twitter.com/rN2FJSsUoT
‘లవ్ స్టోరీ’ తర్వాత మరోసారి జోడీ కడుతున్న నాగ చైతన్య, సాయి పల్లవి
‘తండేల్’ సినిమాను A2 పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సెట్ వేశారు. ప్రస్తుతం అందులోనే షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ త్వరలో సినమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటిస్తున్న రెండో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు కలిసి ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
నాగ చైతన్య చివరిసారిగా ‘కస్టడీ’ మూవీలో కనిపించారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ‘ధూత’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Also Read: శృతి హాసన్ తో లోకేష్ రొమాన్స్- బాబోయ్ మరీ ఇంతలా రెచ్చిపోయారేంటి?