అన్వేషించండి

Naga Babu: నాకు మా నాన్నే హీరో, ఆ విషయంలో మా అన్నదమ్ములకు ఆయనే స్పూర్తి: నాగబాబు

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కొణిదెల వెంకట్రావ్ గురించి స్పెషల్ పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు నాగబాబు. తన తండ్రి పోలీస్ అండ్ ఎక్సెజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే రోజుల్లో..

Naga Babu: సినీ నటుడు కొణిదెల నాగబాబు ఓ వైపు సినిమాల్లో చేస్తూనే అటు రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ తన మనసులోని మాటలను నెట్టింట పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కొణిదెల వెంకట్రావ్ ను గుర్తు చేసుకున్నారు. తమ అన్నదమ్ముల జీవితాల్లో తన తండ్రి ప్రభావం ఎంతో ఉందని అన్నారు. ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఒక స్పెషల్ నోట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

నాకు మా నాన్నే పెద్ద హీరో: నాగబాబు

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కొణిదెల వెంకట్రావ్ గురించి స్పెషల్ పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. తన తండ్రి పోలీస్ అండ్ ఎక్సెజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే రోజుల్లో అయన చేసిన అడ్వెంచర్స్ తను ఎప్పటికీ మరిచిపోలేన్నారు. నాన్న చేసిన సహాయాలు పేదలకి, తనని నమ్ముకున్న వారికి, అవసరంలో ఉన్నవారికి తమ అన్నదమ్ములందరికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో తన స్నేహితుల్లో కొంతమంది ఆర్ధికంగా పేదవారికి ఏమన్నా హెల్ప్ అవసరం అయితే నాన్నని డబ్బులు అడిగి హెల్ప్ చేసే వాడినని అన్నారు. ఏ రోజు కూడా ఎవరికీ ఎందుకు అని అడిగేవారు కాదని అలా ఆయన ప్రోత్సాహంతో కొంతమందికి హెల్ప్ చెయ్యగలిగేవాడినని చెప్పారు.

అదే మా అన్నదమ్ములకు స్పూర్తి..

ఎదుటి వారు కష్టంలో ఉంటే తన తండ్రి సాయం చేయడానికి వెనకాడేవారు కాదని అన్నారు నాగబాబు. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి తన పరిధిలో చేతనైనంత న్యాయం చేసేవారు, ఆ ప్రాసెస్ లో ఎంత వాళ్ళనైనా లెక్క చేసే వారు కాదన్నారు. ఆ విషయం లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నాన్నే ఇన్స్పిరేషన్ అని అన్నారు. అలాగే నాన్న మీద ఆధార పడ్డ ఆయన అన్నదమ్ముల పిల్లలకి, అమ్మకు, చెల్లెళ్ళకు ఒక ఫాదర్ లాగా నిలబడి వాళ్ళని ఒక మంచి స్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. ఈ విషయం లో అన్నయ్య చిరంజీవికి నాన్నే ఇన్స్పిరేషన్ అని అన్నారు. ఇలా తమ జీవితాల్లో అనేక అంశాల్లో అయన ప్రభావం చాల ఉందని గుర్తుచేసుకున్నారు. కానీ హ్యాపీ ఫాథర్స్ డే చెప్పటానికి అయన ఇప్పుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తన తండ్రిని తలుచుకోవాలనిపించిందంటూ ఇలా రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక నాగబాబు అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరలోనూ పలు ప్రోగ్రాంలో కనిపిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉంటూ వర్తమాన రాజకీయాలపై స్పందిస్తుంటారు. ఇటీవలే తన కొడుకు వరుణ్ తేజ్ కు నటి లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేశారు. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget