అన్వేషించండి

Konkona Sen Sharma: ‘యానిమల్‘ నాకు సరిపడే సినిమా కాదు, హింస, సెక్స్ ను చూడాలనుకోను: కొంకణా సేన్

Konkona Sen Sharma: ‘యానిమల్’ మూవీపై నటి, ఫిల్మ్ మేకర్ కొంకణా సేన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెరపై మితిమీరిన హింస, సెక్స్ ను తాను చూడాలనుకోనని వెల్లడించింది.

Konkona Sen Sharma Shocking Comments On Animal: రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. గత డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, అదే స్థాయిలో విమర్శలపాలైంది. ఆర్జీవీ లాంటి దర్శకులు సినిమా చాలా బాగుందని ప్రశంసించినా, కొందరు ప్రముఖులు సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసేలా ఉందని విమర్శించారు. తాజాగా ఈ సినిమా గురించి నటి, ఫిల్మ్ మేకర్ కొంకణా సేన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పరిమిత హింస, సెక్స్ ఫర్వాలేదు

2009లో కొంకణా సేన్ శర్మ, రణబీర్ జంటగా ‘వేక్ అప్ సిద్’ అనే సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ తెరెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 47 కోట్లు వసూళు చేసింది. తాజాగా తన సహ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ మీద స్పందించింది. ఓ వైపు తనకు వెండితెరపై హింస, సెక్స్ ను చూడాలి అనిపించడని చెప్తూనే, మరోవైపు పరిమిత మేరకు ఉండే ఫర్వాలేదని వెల్లడించింది. స్టోరీను జస్టిఫై చేసేంత వరకు హింసచ సెక్స్ ను తెర మీద చూపించడంలో తనకు ఇబ్బంది లేదని చెప్పింది. "తెరపై హింస, సెక్స్ ను చూపించడానికి సరైన కారణం ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ, కావాలని వాటిని సినిమాల్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను ఇప్పటి వరకు ‘యానిమల్’ సినిమా చూడలేదు. నేను ఈ సినిమా గురించి వింటున్న విషయాలను బట్టి ఇది నాకు సూటయ్యే సినిమా కాదు అనిపిస్తుంది. కానీ, లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. నా అభిప్రాయం సినిమా మీద పెద్దగా ప్రభావం చూపించదు అనుకుంటున్నాను” అని వెల్లడించింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Konkona Sensharma (@konkona)

‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’ చిత్రంలో  అనిల్‌కపూర్‌, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ను బోల్డ్ గా, అత్యంత వయెలెన్స్ తో చూపించారు దర్శకుడు సందీప్. సినిమాను ఇలా కూడా తీయ్యెచ్చా? అని మేకర్స్ లోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేశారు. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్ ను ప్రకటించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

Read Also: హాలీవుడ్ మూవీలో తెలుగమ్మాయి, 'మీన్ గర్ల్స్’తో సూపర్ సక్సెస్ కొట్టిన మహేశ్ 'బ్రహ్మోత్సం' చిన్నారి

టాప్ హెడ్ లైన్స్

Agadha OTT: సడన్‌గా ఓటీటీ రిలీజ్‌కు కామాక్షి భాస్కర్ల 'అగధ'... ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?
సడన్‌గా ఓటీటీ రిలీజ్‌కు కామాక్షి భాస్కర్ల 'అగధ'... ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?
Panchanama Zee5: జీ5లో 'పంచనామా' ప్రభంజనం... ఉదయభాను నిర్మాణంలో 'ప్రేమిస్తే' భరత్ సిరీస్‌కు రికార్డు వ్యూస్
జీ5లో 'పంచనామా' ప్రభంజనం... ఉదయభాను నిర్మాణంలో 'ప్రేమిస్తే' భరత్ సిరీస్‌కు రికార్డు వ్యూస్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చిక్కకు దొరకకులో చిక్కింది ఎవరు? కెప్టెన్ అయ్యేది ఎవరు? ఆట మధ్యలో వయసు గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చిక్కకు దొరకకులో చిక్కింది ఎవరు? కెప్టెన్ అయ్యేది ఎవరు? ఆట మధ్యలో వయసు గొడవ!
Hatah Teaser Review : బిగ్ బాస్ తనూజ హతః టీజర్ - సూపర్ థ్రిల్ పంచే స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ తనూజ హతః టీజర్ - సూపర్ థ్రిల్ పంచే స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget