అన్వేషించండి

నందమూరి చైతన్య కృష్ణ ‘బ్రీత్’ టీజర్ వచ్చేసింది - సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా!

వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి చైతన్య కృష్ణ హీరోగా రాబోతున్న 'బ్రీత్' టీజర్ రిలీజైంది. ఈ ఇంట్రస్టింగ్ టీజర్ ను బసవతారకరామ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది.

Breathe Tease Release : 'బ్రీత్' సినిమాతో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు అయిన జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'బ్రీత్'.. వైద్యో నారాయణో హరి అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ ను బట్టి చూస్తే.. ఈ మూవీ ఓ హాస్పిటల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని తెలుస్తోంది. చైతన్య కృష్ణ ఓ రోగి పాత్రలో కనిపించనున్నారు. ఇంట్రస్టింగ్ అండ్ సస్పెన్స్ సీన్స్ తో ఈ టీజర్‌ను నింపేశారు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ టీజర్ సినిమాపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

ఇక 'బ్రీత్‌'కి వంశీ కృష్ణ ఆకెళ్ళ రచన, దర్శకత్వం వహించారు. వంశీ కృష్ణ గతంలో 'రక్ష' (2008), 'ది ట్రిప్' (2021) చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను చైతన్య తండ్రి తన బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది వారి ప్రొడక్షన్ బ్యానర్ తొలి ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా బసవతారకరామ క్రియేషన్స్ సంస్థ దీన్ని అధికారికంగా ఆవిష్కరించారు.

'బ్రీత్' సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో చైతన్య.. వర్షంలో గొడుగు పట్టుకుని ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశాడు. 

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్, SRS ప్రసాద్, అయిషాని మరియు సహస్ర కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బ్రీత్ కు సినిమాటోగాఫర్ రాకేష్ హోషమణి, ఎడిటింగ్ బి నాగేశ్వర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్ భాస్కర్ ముదావత్. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, 8AM మెట్రో వంటి చిత్రాలకు సంగీతం అందించిన మార్క్ కె రాబిన్ బ్రీత్ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారు. కాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. 

Read Also : Vyooham Movie Teaser : అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు - వర్మ 'వ్యూహం'లో జగన్, టీజర్ చూశారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today September 24: నిషికను అనుమానించిన యువరాజు..తప్పుచేశానని నమ్మితే కాల్చేవేయని గన్‌ తీసి ఇచ్చిన నిషిక
జగద్ధాత్రి సీరియల్: నిషికను అనుమానించిన యువరాజు..తప్పుచేశానని నమ్మితే కాల్చేవేయని గన్‌ తీసి ఇచ్చిన నిషిక
Bigg Boss Season 10 Today September 24th Episode Promo 2 Written Update In Telugu In Star Maa Jio Hotstar
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఫుడ్ పెట్టి.. వార్నింగ్ మెసేజ్‌లు పంపిన బిగ్‌బాస్! మండిపోతున్న షాలిని, వర్షిని!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటి కాళ్లు నొక్కిన క్రిష్.. అంబికతో మహా గొడవ! విహారికి గోల్డె మెడల్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటి కాళ్లు నొక్కిన క్రిష్.. అంబికతో మహా గొడవ! విహారికి గోల్డె మెడల్!
Paradise KCR Role: కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు
కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
Sai Durgha Tej : ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?
'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?
Hyderabad Tank Bund hit and run case: ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!
ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!
Dancers Association Sumalatha Devi : డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలిపై దాడి - జనరల్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత
డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలిపై దాడి - జనరల్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత
Embed widget