అన్వేషించండి

Mahesh Babu: మా అమ్మాయి తెలుగు సినిమాలు చేయదు.. ఆమెతో పనిచేయడం ఇబ్బందే: మహేష్ బాబు

మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ఆసక్తికర విషయం చెప్పారు. ఇంగ్లీష్ సినిమాల్లో నటించాలనేది ఆమె కోరికని ఆయన తెలిపారు.

‘‘మా అమ్మాయి సితార తెలుగు సినిమాలు చేయనంది. ఇంగ్లీష్ సినిమాల్లో చేయడమంటేనే తనకు ఇష్టమంది’’ అని సూపర్ మహేష్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన ఓ సంస్థ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘మీ కూతురు సితార సినిమాల్లో చేస్తుందా? మీరు ఆమెతో కలిసి నటించేయడానికి సిద్ధమేనా?’’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేను నా కూతురితో పనిచేయాలంటే ఇబ్బంది(నెర్వస్)గా ఫీలవుతా. ఆమె ఇంగ్లీష్ సినిమాలు చేస్తానని అంటుంది. ఈ విషయాన్ని ఆమె జోక్‌గా చెప్పింది. సితార ఇంకా చిన్నపిల్ల. ఆ ఏజ్‌లో ఆలోచనలు అలాగే ఉంటాయి. ‘ఫ్రోజెన్’ సినిమాకు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆమెకు ఆ ఆసక్తి పెరిగింది. ఆ ప్రభావం వల్ల ఆమెకు ఇంగ్లీష్ సినిమాలపై ఆసక్తి పెరిగింది. మన పిల్లల మీద ఏదీ ఫోర్స్ చేయకూడదు. నిర్ణయం వారికే వదిలేయాలి’’ అని మహేష్ బాబు తెలిపారు.  

Also Read: ఆ ప్యానెల్‌లో నటులు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు.. వాళ్లు పనిచేయలేరు: మంచు విష్ణు

త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలపై త్వరలోనే ప్రకటన: దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా ఈ ఏడాదిలోనే ఉండవచ్చని మహేష్ బాబు అన్నారు. రాజమౌళితో సినిమా గురించి స్పందిస్తూ.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని, ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నా అని తెలిపారు. తనకు తండ్రి కృష్ణ నటించిన ‘అల్లురి సీతారామరాజు’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ బాబు తెలిపారు. ఇప్పట్లో వెబ్‌సీరిస్ చేసే ఆలోచన లేదని మహేష్ బాబు అన్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా ‘పోకిరి’ స్థాయిలో హిట్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..

నేను మొబైల్ ఎక్కువ ఉపయోగించను: ‘‘నేను మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించను. నా పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు ఫోన్ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు క్లాసులన్నీ ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల పిల్లలకు ఫోన్ ఇవ్వక తప్పడం లేదు. అలాగని పిల్లలకు ఫోన్ ఇవ్వాలని ప్రోత్సహించడం లేదు’’ అని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.  పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఇప్పటికే దుబాయ్, గోవాలో షూటింగ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో స్పెయిన్‌‌‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది. 

Also Read: జీవిత ప్రలోభ పెడుతోంది.. కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు, హీటెక్కిన ‘మా’ ఎన్నికలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget