Mukha Chithram Teaser: కలర్ ఫొటో టీమ్ నుంచి కొత్త థ్రిల్లర్, ‘ముఖచిత్రం’ టీజర్ చూశారా?
కలర్ ఫొటో టీమ్ మళ్లీ కలిసి పనిచేసిన సినిమా ‘ముఖ చిత్రం’. ఈ సినిమా టీజర్ విడుదల అయింది.

2020లో ఆహాలో విడుదలైన కలర్ ఫొటో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా.. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంకి కూడా ఆ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ల టీమ్ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమానే ‘ముఖ చిత్రం’. కలర్‌ఫొటోకు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
ముఖ చిత్రం టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. టీజర్‌లో కథను పెద్దగా రివీల్ చేయలేదు. ఇద్దరు డాక్టర్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, మరో అల్ట్రా మోడర్న్ అమ్మాయి. వీరి మధ్య జరిగే కథే ఈ ముఖచిత్రం అని మాత్రం తెలుస్తోంది. హుషారు ఫేమ్ ప్రియ వడ్లమాని, 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, ఆయేషా ఖాన్, సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ట ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్‌ను కూడా టీజర్‌లో చూపించారు.
ఈ సినిమాను త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం తెలియరాలేదు. ప్రముఖ నిర్మాత, పీఆర్వో ఎస్‌కేఎన్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ అంగిరేకుల, మోహన్ ఎల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















