అన్వేషించండి

Mrunal Thakur: అతడు కళ్లతోనే మాట్లాడుతాడు, నా డ్రీమ్ రోల్ అదే - మృణాల్ ఠాకూర్

అందాల తార మృణాల్ ఠాకూర్ నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడు కళ్లతోనే మాట్లాడే గొప్ప నటుడని చెప్పింది. తన డ్రీమ్ రోల్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘సీతారామం’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకుంది అందాల తార మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం గత ఏడాది(2022) ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద హొయలుపోయింది. సినీ అభిమానులతో పాటు ఫ్యాషన్ విమర్శకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె కేన్స్ ఫెస్టివల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

మార్కెల్ సినిమాలో భాగం కావాలి!

తాజాగా ఈ ముద్దుగుమ్మ నానితో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్  21న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మృణాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన డ్రీమ్ రోల్ తో పాటు నాని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  ఏదో ఒక రోజు మార్కెల్ సినిమాలో భాగం కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. “నేను మార్కెల్ సినిమాలకు పెద్ద అభిమానిని. ఆ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తాను. నేను ఏదో ఒక రోజు మార్వెల్ మూవీలో భాగం కావాలని భావిస్తున్నారు. భాగం అయ్యేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.  

నాని కళ్లతో మాట్లాడే గొప్ప నటుడు!

ఇక నానితో కలిసి చేస్తున్న సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. “నాని చాలా గొప్ప నటుడు. అతడి నటన చాలా నేచురల్ గా ఉంటుంది. తను కళ్లతో మట్లాడగలిగే శక్తి ఉంది. ప్రస్తుతం నాని సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. నేను ఇప్పటి వరకు చదివిన స్ర్కిప్ట్ లలో ఈ సినిమా స్ర్కిప్ట్ బెస్ట్ గా ఉంది. ఈ సినిమా చక్కటి కథతో తెరకెక్కుతున్నది. నేను చేయాలని కోరుకుంటున్న సినిమా కూడా ఇదే. ఇదో అద్భుతమైన చిత్రం కాబోతోంది” అని తెలిపింది.  ఈ సినిమాలో నటనకు గాను మృణాల్ రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ సినిమా వరకు రూ. 2 కోట్లు తీసుకున్న ఈమె, ఆ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో పారితోషికం పెంచిందట.

ఓ వైపు నాని సినిమాలో చేస్తుండగానే తెలుగులో మరో ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో రామ్ చరణ్ తో నటించే అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత  రామ్ చరణ్ ‘ఉప్పెన’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌  ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

Read Also: విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో ప్రతిష్టాత్మక చిత్రం, ఇంట్రెస్టింగ్ వీడియోతో మూవీ రివీల్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TN 2026 Vs Jana Nayagan: టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
Trisha: నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
kalavari kodalu kanaka mahalakshmi serial today April 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని శిక్షించిన అమ్మవారు! వారసుడికి ఇక ఏ గండం లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని శిక్షించిన అమ్మవారు! వారసుడికి ఇక ఏ గండం లేనట్లేనా!
Nindu Manasulu Serial Today April 7th: నిండు మనసులు: తల్లీకొడుకుల బంధం ప్రేరణ శాశ్వతంగా తెంచేసిందా! ప్రేరణకు దండం పెట్టి వెళ్లిపోయిన సిద్ధూ!
నిండు మనసులు: తల్లీకొడుకుల బంధం ప్రేరణ శాశ్వతంగా తెంచేసిందా! ప్రేరణకు దండం పెట్టి వెళ్లిపోయిన సిద్ధూ!

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Smart Lockdown: పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
Revanth vs Vijayan: రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
David Warner : ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
Zaheerabad Crime: పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
Baby Massage Benefits : బేబీకి మసాజ్ వల్ల కలిగే లాభాలు ఇవే.. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి
బేబీకి మసాజ్ వల్ల కలిగే లాభాలు ఇవే.. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి
TN 2026 Vs Jana Nayagan: టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
Embed widget