రజినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త సినిమా లుక్ రివీల్ చేయనున్న టీమ్!
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీకాంత్ కొత్త సినిమా 'లాల్ సలామ్'కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని భాయ్ పేరును మే 8న రివీల్ చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది
Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్ట్స్ మూవీ 'లాల్ సలామ్' మూవీకి సంబంధించి లైకా ప్రొడక్షన్స్ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. మే 8న మన భాయ్ మళ్లీ ముంబైకి వస్తున్నారంటూ తెలిపింది. ఈ సమయంలోనే తెల్లవారుజామున 12గంటలకు అతని పేరును కూడా రివీల్ చేయనున్నామంటూ పోస్టులో వెల్లడించింది. దాంతో పాటు ఓ పురాతన కట్టడంలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను కూడా లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న లాలా సలామ్ మూవీపై కు సంబంధించి అప్ డేట్ రావడంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దాంతో పాటు మేకర్స్ రివీల్ చేసే ఆ భాయ్ పేరు ఏంటోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్'.ఈ సినిమా గత కొన్ని క్రితమే పూజా కార్యాక్రమాలు పూర్తి చేసుకుంది, కాగా సినిమాలో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దాంతో పాటు అలనాటి నటి జీవిత రాజశేఖర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండడం మరో చెప్పుకోదగిన విషయం, దాదాపు 33ఏళ్ల జర్నీ తర్వాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుండడంతో.. ఈ సినిమాపై ఆనాటి సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమాలో జీవిత, రజినీకాంత్ సోదరిగా నటించనున్నట్టు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆమె చివరగా 1990లో మగాడు సినిమాతో ప్రేక్షకులను అలరించగా... మళ్లీ ఇన్నాళ్లకు ఆడియెన్స్ ముందుకు రాబోతుండడం విశేషం.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న 'లాల్ సలామ్' సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా రజినీకాంత్ 170వ చిత్రం కానుండడంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
'లాల్ సలామ్' సినిమాలో రజినీకాంత్.. ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో 'జైలర్'లో రజినీ కాంత్ నటిస్తున్నారు. గతేడాది ‘అన్నాతే’ చిత్రంతో నిరాశ పరిచిన రజినీ ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్ లో పెట్టారు. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవలే 'తలైవర్ 171'కి కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ చిత్రానికి తమిళ క్రేజీ డైరెక్టర్,‘మాస్టర్’,‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ ‘లియో' చిత్రంతో బిజీగా ఉన్నారు.
'జైలర్'లో రజినీకాంత్.. ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా పోరాడే ఓ రిటైర్డ్ ముస్లిం పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా రజినీకాంత్ 'లాల్ సలామ్' తర్వాత.. జ్ఞానవేల్ డైరెక్షన్ లో రాబోతున్న 'తలైవర్ 170'లో నటించనున్నారు. తన మొదటి సినిమా 'జై భీమ్' ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.