అన్వేషించండి

Bholaa Shankar Movie Update: ‘భోళాశంకర్’ నుంచి సాలిడ్ అప్ డేట్, స్పెషల్ ట్వీట్ చేసిన దర్శకుడు మెహర్ రమేష్

‘భోళాశంకర్’ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్రబృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. తమిళ్ సినిమా ‘వేదాళం’కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అభిమానులు బాగా ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భోళాశంకర్’ షూటింగ్ పూర్తి- ట్వీట్ చేసిన దర్శకుడు

తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మెహర్ రమేష్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ‘భోళాశంకర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “‘భోళాశంకర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ కోసం కష్టపడిన నటీనటులు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాలు, పాటల విడుదల త్వరలోనే మొదలవుతుంది” అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meher Ramesh (@meherramesh)

హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న అభిమానులు

మెగాస్టార్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్లు అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘భోళాశంకర్’ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని భావిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

ఆగస్టు 11ప్రపంచ వ్యాప్తంగా 'భోళా శంకర్' విడుదల

‘భోళాశంకర్’ మూవీని ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్  ఇప్పటికే వెల్లడించింది. విడుదల తేదీ మార్చే అవకాశం ఉందని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేసింది. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.

Read Also: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Siddharth: ‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Embed widget