Acharya: 'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్.. 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్..
'ఆచార్య' టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మొదట ఫిబ్రవరి 4న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు కొత్త డేట్ అనౌన్స్ చేయడంతో.. మిగిలిన సినిమాలన్నీ రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ముందుగా 'ఆచార్య' టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మొదట ఫిబ్రవరి 4న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. చర్చలు జరిపిన అనంతరం.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి సినిమాలను తీయడంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
View this post on Instagram
Doors to Dharmasthali have opened!
— Konidela Pro Company (@KonidelaPro) January 29, 2021
Here’s MEGASTAR as ACHARYA... #ACHARYATEASER OUT NOW🔥 #Acharyahttps://t.co/tqcEyV8xZZ@KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets