Chiranjeevi- Vaishnavi Chaitanya: వైష్ణవి.. జయసుధను మరిపిస్తోంది - ‘బేబీ’ హీరోయిన్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం
‘బేబీ‘ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగులో మరో సహజ నటిగా ఆమెను అభివర్ణించారు. వైష్ణవికి మంచి సినీ భవిష్యత్ ఉండబోతోందన్నారు.
![Chiranjeevi- Vaishnavi Chaitanya: వైష్ణవి.. జయసుధను మరిపిస్తోంది - ‘బేబీ’ హీరోయిన్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం Megastar Chiranjeevi Great Words About Baby Movie Actress Vaishnavi Chaitanya Chiranjeevi- Vaishnavi Chaitanya: వైష్ణవి.. జయసుధను మరిపిస్తోంది - ‘బేబీ’ హీరోయిన్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/ba02d5a256a4dac603bafc7ee1ed9d951690783307592544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.'కలర్ ఫోటో' లాంటి నేషనల్ అవార్డు అందుకున్న మూవీకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. విడుదల తర్వాత సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది.
‘బేబీ’ హీరోయిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతం అంటూ పొగడ్తలు గుప్పించారు. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరారు. ‘బేబీ’ మూవీపై, ఈ సినిమా హీరోయిన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. తొలి సినిమాలోనే అద్భుతంగా నటించిన వైష్ణవికి అద్భుతమైన సినీ భవిష్యత్ ఉందని మెచ్చుకున్నారు. ‘‘బేబీ.. సినిమాలో అందరూ మంచి వాళ్లే. అన్ని క్యారెక్టర్స్ మంచివే. విలన్ లేకుండా ఇంత బాగా చేశారంటే, ఆ విలన్ ఎక్కడో కాదు, మన మానసిక సంఘర్షణ, ముఖ్యంగా వైష్ణవి సంఘర్షణ ఈ సినిమాను ఆద్యంతం నిలబెట్టింది. ఆమె నటన చాలా సహజంగా ఉంది. బస్తీలో ఉండే ఓ మామూలు అమ్మాయి మేకోవర్ లో అత్యంత గ్లామర్ గా తయారైందంటే తను తీసుకున్న శ్రద్ధ, ఆసక్తి, నటనలతో తన ట్రాన్సఫర్మెన్స్ చాలా బాగుంది. ఎన్నో సీన్లలో తను చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. మంచి ఫర్మార్మెన్స్ ఇచ్చింది. ఇదే ఆమె తొలి సినిమా అంటే నమ్మలేకపోతున్నాను. సహజనటి జయసుధ ఉన్నారు. అమె గ్లామర్, డీ గ్లామర్, ఎలాంటి పాత్రలు అయినా చాలా సహజంగా చేస్తుంటారు. అలాంటి జయసుధ గారిని మరిపించే నటి నాకు ఇంత వరకు తారసపడలేదు. వైష్ణవిని చూస్తుంటే ఆ రకమైన లక్షణాలు మెండుగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వైష్ణవికి సినిమా రంగంలో ఎంతో భవిష్యత్ ఉంది. ఆల్ ది బెస్ట్. గ్లాడ్ బెస్ యు” అని చిరంజీవి అభినందించారు.
View this post on Instagram
తొలి సినిమాతోనే అదరగొట్టిన వైష్ణవి
ఓవరాల్ గా యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. నేషనల్ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' సినిమాకి కథ అందించిన సాయి రాజేష్.. ఈసారి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీతో వచ్చాడని చెప్పాలి. ఇందులో ప్రేమించిన అమ్మాయి కోసం పరితమించే ట్రూ లవర్ గా ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వంటి యూట్యూబ్ సిరీస్ లతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. డెబ్యూతోనే అందరినీ ఆకట్టుకుంది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది.
Read Also: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)