Manchu Vishnu: తన కొత్త సినిమా టైటిల్‌ను సరికొత్తగా రివీల్ చేసిన మంచు విష్ణు
మంచు విష్ణు కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయింది.ఆ టైటిల్ ఏంటో చదివి తెలుసుకోండి.

మంచు విష్ణు సినిమా హిట్ కొట్టి చాలా ఏళ్లు అయింది. చివరగా ఆయన మోసగాళ్లు సినిమాలో కనిపించారు. అందులో కాజల్, మంచు విష్ణు అక్కా తమ్ముళ్లుగా కనిపించారు. ఆ తరువాత విష్ణు సినిమా ఏదీ విడుదలవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను సరికొత్తగా రివీల్ చేశారు మంచు విష్ణు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో మంచు విష్ణు సునీల్ కు ఫోన్ చేసి ‘ఏమయ్యా మంళం శీను, ఎలా ఉన్నావ్?’ అంటూ కామెడీగా మొదలు పెట్టారు. సునీల్ కూడా ‘ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావంట’ అని విష్ణును ఆటపట్టిస్తారు. సినిమా టైటిల్ కోసం కోన వెంకట్ సలహాలు తీసుకోమని చెబుతారు సునీల్.
ఆ వెంటనే సీన్లోకి కోన వెంకట్, చోటా కె నాయుడు, అనూప్ రూబెన్స్, ఇషాన్ సూర్య ఒకరి తరువాత ఒకరు ఎంట్రీ ఇస్తారు. వారితో చర్చించాక తన కొత్త సినిమాకు ‘జిన్నా’ అనే పేరును ఖరారు చేసినట్టు చెబుతారు. ఈ సినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పేరుకు షార్ట్ కట్ ‘జిన్నా’ అని కోన వెంకట్ చెప్పారు. ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.
కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథని చెబుతున్నారు. ముగ్గురు స్నేహితుల చుట్టూ సినిమా తిరుగుతుందని వివరించారు. మోసగాళ్లు సినిమా తరువాత విష్ణు ఏ సినిమా ఒప్పుకోలేదు. మా ఎన్నికల్లో బిజీ అవ్వడం వల్ల ఆయన సినిమాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు విష్ణు.
#GINNA!@starlingpayal @SunnyLeone @konavenkat99 @anuprubens @eeshaansuryaah #ChotaKNaidu #PremRakshithhttps://t.co/dLYr3H8GzS
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2022
Also read: కత్తి నువ్వు తెచ్చుకున్నా సరే నన్ను తెమ్మన్నా సరే, బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే ఎవరికైనా పూనకాలే
Also read: ప్రమోషనల్ సాంగ్‌కి స్టెప్పులేసిన హీరో నాని వైఫ్ అంజన, డ్యాన్సు ఇరగదీసిందిగా
Also read: ప్రమోషనల్ సాంగ్‌కి స్టెప్పులేసిన హీరో నాని వైఫ్ అంజన, డ్యాన్సు ఇరగదీసిందిగా
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















