By: ABP Desam | Updated at : 14 Feb 2023 02:20 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Manchu Lakshmi Prasanna/Youtube
నటి, నిర్మాత మంచు లక్ష్మి మళ్లీ జోరు పెంచారు. ఇప్పటికే పలు సినిమాలతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న మంచు లక్ష్మి.. ఈ సారి పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పలు చిత్రాలు బాగానే అలరించాయి. అయితే, కొంత కాలంగా సినిమాలు చేయడం తగ్గించింది. తాజాగా మరోసారి తెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మంచు లక్ష్మి తన తండ్రితో కలిసి ఓ సినిమా చేస్తోంది. అదే 'అగ్ని నక్షత్రం'. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
పవర్ ఫుల్ పోలీసు అధికారిగా మంచు లక్ష్మి
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ అయ్యింది. హీరో దగ్గుబాటి రానా ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మంచు లక్ష్మి పోలీస్ అధికారి పాత్రలో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా జరిగి ఈ ఇన్వెస్టిగేషన్ లో మంచు లక్ష్మి యాక్షన్, సస్పెన్స్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. పోలీసు అధికారిగా ఈ కేసు విషయంలో ఎలా దర్యాప్తు చేస్తోంది. ఎంక్వయిరీ క్రమంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది అనే విషయాలతో ఆసక్తికరంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు.
Unleashing the power of #AgniNakshatram
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 14, 2023
Need all your blessings !!!
Love All ❤️ Happy Valentines Day https://t.co/GdeCHruSaW pic.twitter.com/9owKzojElk
‘అగ్ని నక్షత్రం‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని రానా ఆకాంక్షించారు. తన చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ ‘అగ్నినక్షత్రం‘ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు లక్ష్మిమంచు అండ్ టీమ్. బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
Happy to release the Glimpse of #AgniNakshatram. All the best to @lakshmimanchu & the entire team. Wish you a blockbuster success👍https://t.co/5K6YbAkAU3@themohanbabu@lakshmimanchu@thondankani@mynameisviswant
— Rana Daggubati (@RanaDaggubati) February 14, 2023
@chitrashukla73@itsMVKrishna@achurajamani@madhureddi3 pic.twitter.com/6pvyy4RXg0
మంచు మోహన్‌బాబు, లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినాయకుడిగా సముద్రఖని నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. మలయాళీ నటుడు సిద్ధిఖ్‌తోపాటు, సముద్రఖని, విశ్వంత్, జబర్దస్త్ మహేష్, చైత్ర శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచు లక్ష్మి, మోహన్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించగా, లిజో.కె జోస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా గోకుల్ భారతి పని చేస్తున్నారు. మధురెడ్ఢి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Read Also: 600 మెట్లెక్కి పళని మురుగన్ స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్న సమంత
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
/body>