అన్వేషించండి

Mamata Banerjee: అమితాబ్ బచ్చన్ ‘భారతరత్నం’ - బిగ్ బీకి రాఖీ కట్టిన మమతా బెనర్జీ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో రాఖీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిగ్ బీకి ఆమె రాఖీ కట్టారు. కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.

I.N.D.I.A కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు ముంబైకి వచ్చిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. బిగ్ బీ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్ బీకి దీదీ రాఖీ కట్టారు. అనంతరం అమితాబ్ కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ వేడుకల్లో బిగ్ బీ సతీమణి జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనువరాళ్లు ఆరాధ్య బచ్చన్, శ్వేతానంద, నవ్య నవేలి నంద పాల్గొన్నారు.

బిగ్ బీ ఫ్యామిలీతో రాఖీ వేడుకలు జరపుకోవడం సంతోషంగా ఉంది- మమతా

 ఆ తర్వాత అమితాబ్ ఫ్యామిలీతో కలిసి మమతా మీడియాతో మాట్లాడారు. బిగ్ బీ కుటుంబతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. “ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను భారతరత్నగా భావించే అమితాబ్ కు రాఖీ కట్టాను. అమితాబ్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. గౌరవం కూడా. వారిది దేశంలోనే నెంబర్ వన్ కుటుంబం. సినీ రంగం కోసం వారు ఎంతో కృషి చేశారు. బెంగాల్ లో జరిగే దుర్గాపూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు రావాల్సిందిగా నేను అమితాబ్ ను ఆహ్వానించాను” అని మమతా వెల్లడించారు.  

తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వెల్లడి

మమతా బెనర్జీ, బిగ్ బీ కుటుంబ సభ్యులు సమావేశానికి సంబంధించిన విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించింది. బిగ్ బీ కుటుంబ సభ్యులతో కలిసి మమతా బెనర్జీ రాఖీ పండుగ జరుపుకున్న ఫోటోలను షేర్ చేసింది. భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది. “ఇవాళ జయా బచ్చన్‌  కుటుంబాన్ని ముంబైలోని వారి నివాసంలో సీఎం మమతా బెనర్జీ కలిశారు.  అమితాబ్ బచ్చన్ కుటుంబం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.” అని ట్వీట్ చేసింది.

బిగ్ బీ ఫ్యామిలీతో మమతకు స్నేహపూర్వక సంబంధాలు

నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య ఎంపీ జయ బచ్చన్‌తో మమతా బెనర్జీకి మంచి సంబంధాలున్నాయి. గత ఏడాది, అమితాబ్ బచ్చన్ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మమతా బెనర్జీ భారతీయ సినిమా పరిశ్రమకు బిగ్ బీ చేసిన విశిష్ట సేవలపై అభినందనలు కురిపించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ పాపులర్ టీవీ  రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌ లో పాల్గొంటున్నారు. అటు ఆగష్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.  

Read Also: షారుఖ్‌తో ప్రేమలో ఉన్న అమ్మాయిపై పగ తీర్చుకున్నా- విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget