By: ABP Desam | Updated at : 15 Mar 2023 06:43 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Naga Vamsi/Twitter
ఇటీవల ఓటీటీలో విడుదలైన మలయాళం చిత్రం ‘ఇరాట్ట’ మూవీ చూశారా? అందులో ద్విపాత్రభినయంతో ఆకట్టుకున్న ఆ నటుడు.. ఇప్పుడు తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపొందున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్‌ను విలన్ గా ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో ఆయన ‘చెంగా రెడ్డి’ అనే ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జోజు లుక్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
సాధారణంగా ఒక భాషలో నటించే హీరోలు ఇంకో భాష ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. అయితే ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని భాషల సినిమాల్ని అందరూ ఆదరిస్తుండటంతో అన్ని భాషల నటీనటుల గురించి తెలుసుకుంటున్నారు. వారికి అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. కరోనా తర్వాత ఈ సాంప్రదాయం బాగా పెరిగిందనే చెప్పాలి. మలయాళం సినిమాలలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోన్న పేరు జోజు జార్జ్. ఇటీవలే ఆయన మలయాళంలో ‘ఇరాట్ట’ సినిమాలో నటించారు. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీను తెలుగులోకి కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుందీ మూవీ. అలాగే జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన పలు పురస్కారాలను సైతం అందుకున్నారు.
వైష్ణవ్ తేజ్ సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు జోజు. ఇక ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ఆయన చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లో సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఉన్న ఆయన పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఆయన ఇటీవలె నటించిన ‘ఇరాట్ట’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయనకు మూవీ టీమ్ విషెస్ చెబుతున్నట్టు పోస్టర్ లో కనిపిస్తోంది. మొత్తంగా జోజు జార్జి టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక మొదటి సినిమా ‘ఉప్పెన’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట వైష్ణవ్. ఈ సినిమాలో వైష్ణవ్ పూర్తి స్థాయిలో మాస్ అవతారంలో కనిపించనున్నారని టాక్. భారీ స్థాయిలో పోరాట సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Introducing #JojuGeorge as ferocious, ruthless, troublesome "Chenga Reddy" in #PVT04 🔥
— Naga Vamsi (@vamsi84) March 15, 2023
Congrats on the success of #Iratta, Joju sir! 👏 Can't wait to witness more of your ferocity on the big screen 🤩 #PanjaVaisshnavTej @sreeleela14 #SrikanthNReddy pic.twitter.com/PpRNCBwy1C
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్
Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?
Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
Four MLAS : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!