By: ABP Desam | Updated at : 09 Dec 2022 01:21 PM (IST)
Edited By: Mani kumar
image credit :Namrata/instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓ వైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు వ్యాపారంలోనూ మహేష్ తన మార్క్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి గచ్చిబౌళిలో ఏఎంబీ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఏఎంబీ సూపర్ సక్సెస్ అయి లాభాల పంట పండిస్తోంది. అది కూడా ఐమ్యాక్స్ తరహాలోనే గొప్ప ఆదరణ పొందుతోంది. మహేష్, ఆయన భార్య నమ్రత కలసి అనేక వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వీరు ఇప్పుడు ఫుడ్ అండ్ బేవరేజెస్ బిజినెస్ లో కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే ఒప్పందంలో ఉన్న ఏషియన్ గ్రూప్ తో కలసి ‘మినర్వా ఏఎన్’ అనే హోటల్ ను ప్రారంభించారు. ఈ పేరు లో ఏఎన్ అంటే ఏషియన్ నమ్రత అని అర్థం. దీనికి నమ్రత నే సీఈవో. ఇటీవలే బంజారాహిల్స్ లో తెలంగాణ భవన్ పక్కనున్న ప్యాలస్ హైట్స్ లో మినర్వా కాఫీ షాప్ రెస్టారెంట్ ను నమ్రత పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హోటల్ ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చైన్ బిజినెస్ అని తెలుస్తోంది. ఈ మినర్వా-ఏఎన్ హోటల్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారట మహేష్-నమ్రత. ఇందులో నమ్రత కీలక పాత్ర పోషిస్తుందని టాక్. ముందుగా హైదరాబాద్ లో ఈ హోటల్ ను ప్రారంభించి తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో విస్తరించనున్నారట.'మినర్వా-ఏఓన్' వెజ్ వంటకాలతో అద్భుత రుచులను అందించే ప్రాజెక్ట్ కాగా 'ప్యాలెస్ హైట్స్' పేరుతో మరో కాంటినెంటల్, లోకల్ వంటకాలను కూడా అందించే ప్లాన్ చేస్తున్నారట మహేష్-నమ్రత.
టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారంలోనూ రానిస్తున్నారు. టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున హోటల్స్, హాస్పిటాలిటీ రంగంలో దూసుకుపోతున్నారు. అలాగే హీరో నితిన్ ప్రారంభించిన ఎన్ గ్రిల్, సందీప్ కిషన్ స్టార్ట్ చేసిన వివాహ భోజనంబు లాంటి హోటల్ సక్సెస్ అయ్యాయి. అలాగే చాలా మంది యువ హీరోలు కూడా రకరకాల వ్యాపాారాల్లో పెట్టుబడులు పెట్టి రానిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
Ennenno Janmalabandham February 7h: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్
Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?