Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్
బుల్లితెర జంట శ్రీహాన్, సిరి ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత వీరి ప్రేమ వ్యవహారం ఆసక్తిగా నడిచింది. ఇటీవల వీరిద్దరూ కలసి పాల్గొన్న ఓ టీవీ షో ప్రోమో వైరల్ అవుతోంది.
బుల్లితెర జంట శ్రీహాన్, సిరి హనుమంతు ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో సిరి హనుమంతు పాల్గొంది. ఇదే సీజన్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా పాల్గొన్నాడు. అయితే హౌస్ లో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండటంతో నెటిజనులు అప్పట్లో సిరిని దారుణంగా ట్రోల్ చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీహాన్-సిరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత వీళ్లిద్దరూ కలసిపోయి ఎప్పటిలాగే ఉంటున్నారు.
ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ టీవీ ఛానల్ లో జరిగిన కార్యక్రమానికి శ్రీహాన్ తన ప్రేయసి సిరి హనుమంతుతో కలసి వచ్చాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదల అయింది. ఈ ప్రోమోలో శ్రీహాన్, సిరితో కలసి ఇతర బుల్లితెర నటీనటులు కూడా సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్’లో జరిగిన ఘటనలను తలచుకుంది. షన్నుతో క్లోజ్‌గా ఉండటంపై పరోక్షంగా స్పందించింది. సిరి తాను చేసిన పొరబాట్లు గురించి ఈ వేదిక పై చెప్పింది. శ్రీహాన్ కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసింది. శ్రీహాన్ చాలా యూనిక్ గా ఉంటాడని అందుకే ఈ రోజ్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. శ్రీహాన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యానని, తను గుర్తొచ్చినప్పుడల్లా తన దగ్గర ఉన్న శ్రీహాన్ షర్ట్ ను కిస్ చేసేదానినని చెప్పింది.
తన దగ్గర గుర్తుగా దాచుకున్న ఆ షర్ట్ ను శ్రీహాన్ కు గిఫ్ట్ గా ఇచ్చింది. దానితో పాటు ఇంకా చాలా గిఫ్ట్ లు శ్రీహాన్ కు ఇచ్చి ప్రపోజ్ చేసింది సిరి. జీవితంలో చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారని, అయితే వాటిని ఇలా స్టేజ్ మీద ఎవరూ ఒప్పుకోరు అని చెప్పుకొచ్చింది సిరి. తాను తెలియకుండానే తప్పు చేశానని కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహాన్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే బిగ్ బాస్ 5 తర్వాత యూట్యూబర్ షన్ను, తన ప్రేయసి దీప్తి సునయన మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తర్వాత వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. సిరి తన తప్పు తెలుసుకొని శ్రీహాన్ కు దగ్గరైనా షన్ను, దీప్తిలు మాత్రం ఇప్పటి వరకూ కలవలేదు. మరి భవిష్యత్తులో ఏమైనా కలుస్తారో లేదో చూడాలి. ‘బిగ్ బాస్’ సీజన్-6లో శ్రీహన్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, విన్నర్ రేవంత్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీని శ్రీహాన్ గెలుచుకోవడం గమనార్హం. అంతేకాదు.. ‘బిగ్ బాస్’ సీజన్-6లో అత్యధిక ఓట్లతో రియల్ విన్నర్‌గా నిలిచింది కూడా శ్రీహాన్ అని హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్