అన్వేషించండి

Pushpa Movie Updates: తగ్గేదేలే.. 'పుష్ప' లేటెస్ట్ అప్డేట్.. ఐదు భాషల్లో ఫస్ట్ సింగిల్

బన్నీ ఫ్యాన్స్ వేస్తున్న ట్వీట్లను, పోస్ట్ లను చూసిన 'పుష్ప' టీమ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ఈరోజు అప్డేట్ ఉండబోతుందంటూ సంకేతాలు ఇచ్చింది. 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ చెబుతున్నారు. అలానే ట్విట్టర్ లో 'తగ్గేదేలే' అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ వేస్తున్న ట్వీట్లను, పోస్ట్ లను చూసిన 'పుష్ప' టీమ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ఈరోజు అప్డేట్ ఉండబోతుందంటూ సంకేతాలు ఇచ్చింది. 

దీంతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ రాబోతున్నట్లు ప్రేక్షకులు ఊహించారు. దానికి తగ్గట్లే చిత్రబృందం చిన్నపాటి టీజర్ ను విడుదల చేసింది. ఇందులో దేవిశ్రీప్రసాద్ తో పాటు ఐదు భాషలకు చెందిన సింగర్స్ కనిపించారు. శివమ్, బెన్నీ డయల్, విజయ్ ప్రకాష్, రాహుల్ నంబియార్, విశాల్ దద్లాని లాంటి టాలెంటెడ్ సింగర్స్ తో మొత్తం ఐదు భాషల్లో పాటను పాడించారు. ''దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక'' అంటూ సాగే ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. 

దీంతో ఫ్యాన్స్ ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పాటలు కొన్నేళ్ల పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని.. ప్రతీ పాట అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత దేవిశ్రీప్రసాద్ హవా మళ్లీ మొదలవుతుందని అంటున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల తిరిగి మొదలుపెట్టారు. కానీ దర్శకుడు సుకుమార్ అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. 

నిజానికి ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి కావాల్సిన ఫుటేజ్ మొత్తాన్ని చిత్రీకరించేశారు. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలానే రెండో పార్ట్ కి కావాల్సిన ఫుటేజ్ ను కూడా చిత్రీకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాదికల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తే వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను విడుదల చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఫస్ట్ పార్ట్ తరువాత కొత్త సినిమా చేయాలనుకుంటున్నారు. ఆ తరువాత సుకుమార్ కి కాల్షీట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ సుకుమార్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. 
మరి ఈ విషయంలో హీరో, దర్శకుడు ఒక మాట మీదకు వస్తారేమో చూడాలి. ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Trailer Tease: దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Gaddar Awards 2025 : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
Embed widget