అన్వేషించండి

Love Today Telugu: ‘లవ్ టుడే’ రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో నవ్వుల జాతర ఖాయం!

తమిళంలో సంచలనం సృష్టించిన ‘లవ్ టుడే’ తెలుగు వెర్షన్ నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘లవ్‌టుడే’ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 25వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఇందులో హీరోగా కూడా నటించాడు. తనకు జోడిగా ఇవానా కనిపించింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆడియో పరంగా కూడా ఈ సినిమా పెద్ద హిట్.

నవంబర్ 25వ తేదీన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’, వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా (తెలుగులో తోడేలు)’లతో ‘లవ్ టుడే’ పోటీ పడనుంది. వీటిలో డబ్బింగ్ సినిమాలు అయిన ‘భేడియా’ను అల్లు అరవింద్, ‘లవ్ టుడే’ను దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

‘లవ్ టుడే’ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో కామెడీని మిక్స్ చేసి సరదాగా సాగిపోయేలా తీశారు దర్శకుడు ప్రదీప్. హీరో ఉత్తమన్ ప్రదీప్, నికిత ప్రేమించుకుంటారు. నికిత తండ్రిని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రదీప్. అయితే నికిత తండ్రి సత్యరాజ్ ఒక మెలిక పెడతాడు. వీరిద్దరూ ఒక రోజు తమ మొబైల్స్ మార్చుకుని తర్వాత రోజు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని  చెప్తాడు.

దీంతో ప్రదీప్, నికిత తమ స్మార్ట్ ఫోన్‌లను మార్చుకుంటారు. అయితే ఫోన్లు మార్చుకున్న తర్వాత ప్రదీప్, నికిత తమ రహస్యాలు బయటికి వస్తాయనే ఆందోళన మొదలవుతుంది. తర్వాత వారు ఒకరి ఫోన్‌ను మరొకరు చెక్ చేసుకోవాలని అనుకుంటారు. ఫోన్లు అన్ లాక్ చేసిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు ? తర్వాత ఏమవుతుంది ? చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా విడిపోతారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సినిమా ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో ఆసక్తి నెలకొంది. సినిమాలో సత్యరాజ్, యోగి బాబు, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget