అన్వేషించండి

Konidela Niharika: పరస్పర అంగీకారంతోనే విడిపోయాం, ప్రైవసీ కావాలి - విడాకులపై నిహారిక ఫస్ట్ రియాక్షన్

తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకుల తర్వాత నిహారిక తొలిసారి రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పుకొచ్చింది.

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నారు.  2020 డిసెంబర్ లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట, ఎక్కువ కాలం సంసార జీవితంలో కొనసాగలేదు. పెళ్లైన కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. 

పరస్పర అంగీకారంతో విడాకులు- నిహారిక

విడాకులపై నిహారిక ఎలా స్పందిస్తుంది? విడాకులకు గల కారణాల గురించి చెపుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సోషల్ మీడియాలో తొలి పోస్ట్ చేసింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. “చైతన్య నేను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, మిత్రులకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయం నుంచి బయట పడేందుకు నాకు ప్రస్తుతం కాస్త ప్రైవసీ కావాలి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. అటు చైతన్య కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వాస్తవానికి నిహారిక కొణిదెల ఎందుకు విడాకులు తీసుకున్నారు? సంసార జీవితంలో చిక్కులు ఎందుకు వచ్చాయి? కారణాలు ఏమిటి? అనేది బయటకు రాలేదు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

వాస్తవానికి నిహారిక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ తో ఆగస్టు 13, 2020లో ఆమె నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది డిసెంబర్ 9న ఏడు అడుగులు వేశారు. రాజస్థాన్, ఉదయ్‌పూర్ కోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది.  మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి జె. ప్రభాకర్ రావు సన్నిహితులు. చాలా ఏళ్లుగా ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఉంది. పిల్లలకు పెళ్లి చేస్తే స్నేహబంధం బంధుత్వంగా మారుతుందని ఆశించారు. పెళ్లి చేశారు. అయితే... పిల్లల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి విడాకులకు దారి తీశాయి. పరస్పర అంగీకారంతో నిహారిక, చైతన్య వేరు పడ్డారు. 

నెల క్రితమే విడాకులు!

కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్య చేసిన దరఖాస్తు బయటకు రావడంతో మంగళవారం (జూలై 4) సాయంత్రం హడావిడి జరిగింది. అసలు విషయం ఏమిటంటే... నెల క్రితమే ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే... ఆలస్యంగా డివోర్స్ పిటిషన్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. పెళ్లికి ముందు నిహారిక వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. చేసినవి తక్కువే అయినా గానీ నటిగా కెరీర్ కంటిన్యూ అవుతూ ఉండేది. చైతన్య నుంచి వేరు పడటంతో ఇప్పుడు ఆమె మళ్ళీ నటన, నిర్మాణం మీద దృష్టి పెట్టారు. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో ప్రధాన పాత్ర పోషించారు. నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారని తెలిసింది. 

Read Also: మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులు? ఆవిడ రష్యాకు తిరిగి వెళ్లిపోయారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 25th:పూజ దగ్గర పెట్టిన డబ్బులు,నగలు మాయం...జగధాత్రిని నిలదీసిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్:పూజ దగ్గర పెట్టిన డబ్బులు,నగలు మాయం...జగధాత్రిని నిలదీసిన వైజయంతి
Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget