Image Credit:Sreeleela/Instagram
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకి చేరిపోయింది శ్రీలీల. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా గతేడాది వచ్చిన ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో అరడజను సినిమాలకు పైగానే ఆమో చేతిలో ఉన్నాయి. కాస్త కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీ బిజీ అయిపోయిందీ ముద్దుగుమ్మ. తాజాగా శ్రీలీల గురించి ఓ వార్త నెట్టంట వైరల్ అవుతోంది.
శ్రీలీల కు తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. చేతి నిండా సినిమాలు ఉండటంతో రోజుకు రెండు షిఫ్ట్ లు షూటింగ్ లో పాల్గొంటుందని టాక్. అయితే శ్రీలీల క్రేజ్ చూసి ఇద్దరు పెద్ద తమిళ నిర్మాతలు తమ సినిమాలో నటించాలని ఆఫర్ చేశారట. అయితే, టాలీవుడ్‌లో బిజీ షెడ్యూల్ వల్ల శ్రీలీల వారికి సున్నితంగా నో చెప్పిందట. ఈ టైమ్ లో ఇలాంటి రిస్క్ లు చేయడం ఎందుకు అని తమిళ్ ఆఫర్ కు నో చెప్పిందట. అందులోనే ఇప్పటికే కొన్ని సినిమాలలో నటిస్తోంది ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేయాలని అనుకుంటుందట శ్రీలీల. అలాగే ఇటీలవ టాలీవుడ్ సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే టాలీవుడ్ ను విడిచిపెట్టే ఆలోచన ఇప్పట్లో చేయదనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి నటిస్తున్నారు యాక్టర్స్. పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీల మధ్య దూరం కూడా బాగా తగ్గుతోంది. మరి ఇలాంటి నేపథ్యంలో శ్రీలీల టాలీవుడ్ కే పరిమితం అవుతుందా లేదా తర్వాత అవకాశం చూసుకొని ఇతర భాషల్లో కూడా నటిస్తుందా అనేది చూడాలి.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది శ్రీలీల. చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల పక్కన కూడా ఛాన్స్ లు కొట్టేస్తుందీ బ్యూటీ. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తోన్న ‘ఎన్బీకే 108’లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యనే షూటింగ్ లో కూడా పాల్గొంది కూడా. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లో కూడా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా శ్రీలల నటిస్తోందని తెలుస్తోంది. ఇలా పెద్ద హీరోలతోనే కాకుండా నితిన్, విజయ్ దేవరకొండ, రామ్ లాంటి హీరోల సరసన కూడా జతకడుతోంది శ్రీలీల.
Also Read : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్
Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి
Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన
/body>