అన్వేషించండి

Director Dayanandh: 'హ్యాపీ డేస్' చూశాక ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైంది, 'ఏ మాయ చేసావె' తర్వాత... 

Game On Movie: గీతానంద్, నేహా సోలంకి జంట‌గా నటించిన 'గేమ్ ఆన్' సినిమాతో దయానంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చెప్పిన విశేషాలు...

డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ అభిమానిగా 'గేమ్ ఆన్' తీశానని దర్శకుడు దయానంద్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు తెలిపారు. సినిమా మేకింగ్ మీద తనకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అనేది ఇంటర్వ్యూలో వివరించారు.   

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ఇతర ప్రధాన తారాగణం. దయానంద్ దర్శకత్వం వహించారు. క‌స్తూరి క్రియేష‌న్స్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థలపై ర‌వి క‌స్తూరి నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో దయానంద్ ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో... 

స్కూల్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ మొదలైంది!
"నాకు స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ మొదలైంది. శేఖర్ కమ్ముల గారు తీసిన 'హ్యాపీ డేస్' చూశాక ఆ ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది. 'ఏం మాయ చేసావె' చూశాక... సినిమాను సహజంగా తీయవచ్చని అనిపించింది. గౌతమ్ మీనన్ మేకింగ్ అంత న్యాచురల్‌గా ఉంది. అయితే... సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి మాత్రం పూరి జగన్నాథ్ గారు. దర్శకుడు కావాలని అనుకున్న తర్వాత ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశా. తర్వాత అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో ఆరు నెలల కోర్స్ చేశాను. ప్రొడక్షన్,  సౌండింగ్ గురించి అక్కడ నేర్చుకున్నాను'' అని దయానంద్ చెప్పారు.

జీవితం ఆట అయితే... అందులో తొమ్మిది టాస్కులు!
''దర్శకుడిగా నా మొదటి సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా... ప్రతి కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలతో పాటు డిఫరెంట్‌గా ఉండాలనుకున్నా. నా మార్క్ ఉండాలని ప్రయత్నించా. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక ఆట ప్రవేశిస్తే... అతని జీవితం ఎలా మారింది? అనేది సినిమా. జీవితం ఆట అయితే... అందులో తొమ్మిది టాస్కులు ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే టాస్క్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్'' అని దయానంద్ కథ, కాన్సెప్ట్ గురించి వివరించారు.

Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...

హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ హీరోలా ఉంటుంది
''ఇదొక రా అండ్ రస్టిక్ సినిమా. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కావాలని వాటిని రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఆదిత్య మీనన్ గారు స్మార్ట్ క్యారెక్టర్ చేశారు. ఆయనది సైకలాజికల్ డాక్టర్ రోల్. శుభలేఖ సుధాకర్ గారు కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సీనియర్ ఆర్టిస్టులు అందరూ సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది. నిర్మాత రవి కస్తూరి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా చాలా సపోర్ట్ చేశారు'' అని దయానంద్ చెప్పారు. తక్కువ ధియేటర్లలో విడుదలైనా... ఆ తర్వాత థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉందని, కుటుంబం అంతా హ్యాపీగా చూడొచ్చని ఆయన తెలిపారు.

Also Readనైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget