Sammathame: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
'సమ్మతమే' చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

తెలుగులో 'రాజావారు రాణి గారు', 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి సినిమాల్లో హీరో నటించారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు 'సమ్మతమే' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈరోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్ గా వుంది. హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది. హ్యాపీ స్మైల్స్ తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. ఈమె విశాఖపట్నానికి చెందిన అమ్మాయి. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' లో చాలా చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్ గా మారింది. 'కలర్ ఫోటో' సినిమా ఆమెకు మంచిపేరు తీసుకొచ్చింది.
Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే
Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















