అన్వేషించండి

RRR 2: ‘RRR’ సీక్వెల్ దర్శకుడిగా జక్కన్న కొడుకు? ఆయన కాదంటే?

ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే, ఈ సినిమా దర్శకుడుకు ఎవరనే విషయంపై ఆయన ఆసక్తికర విషయం చెప్పారు.

దర్శక దిగ్గజం ఎస్, ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ని అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్  'RRR' కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదని, కానీ 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ విషయంలో చాలా ప్లాన్స్ ఉన్నాయని, 'RRR' సీక్వెల్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించడం లేదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'RRR' సీక్వెల్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది.

'RRR' సీక్వెల్ దర్శకుడిగా కార్తికేయ?

సినిమా పరిశ్రమలో మాత్రం 'RRR' సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి తనయుడు కార్తికేయ అరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి కార్తికేయ ‘RRR’ కోసం రెండవ యూనిట్ డైరెక్టర్‌గా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనేక ముఖ్యమైన సన్నివేశాలను ఆయనే తీశారు.  అంతేకాకుండా, ఈ సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో, ఆస్కార్‌కు ఈ చిత్రం నామినేషన్‌  పొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నిర్మాణంలో ఆయనకున్న అనుభవం దృష్ట్యా 'RRR' సీక్వెల్ కు కార్తికేయ దర్శకత్వం వహించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అయాన్ ముఖర్జీ పేరు పరిశీలన?

ఒకవేళ కార్తికేయ 'RRR'  సీక్వెల్ దర్శకత్వ  బాధ్యతలు చేపట్టకపోతే, ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి గతంలో అయాన్ ముఖర్జీ ప్రతిభను ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ కి కార్తికేయ సారథ్యం వహిస్తాడని అభిమానులు, సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా,  భవిష్యత్తులో కార్తికేయ దర్శకత్వంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ‘దృశ్యం’ కాంబో దూకుడు- ఒక మూవీ షూట్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 7th:కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
Veeradhi Veerulanta: రవితేజ, శ్రీవిష్ణు సినిమాకు క్రేజీ టైటిల్... వీరాధి వీరులంట!
రవితేజ, శ్రీవిష్ణు సినిమాకు క్రేజీ టైటిల్... వీరాధి వీరులంట!
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు
కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు
King 100: 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?
'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget