News
News
X

Karthik Raju New Movie : సోషల్ క్రైమ్ ఇష్యూసే కథగా కార్తీక్ రాజు కొత్త సినిమా

యువ హీరో కార్తీక్ రాజు కొత్త సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

FOLLOW US: 
 
సమాజంలో నేరాలు జరుగుతున్నాయి. నేరగాళ్ళు కొత్త దారులు ఎంపిక చేసుకుని మరీ జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ క్రైమ్స్ ఎక్కువ అయ్యాయి. వాటిని బేస్ చేసుకుని తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఆ సినిమా ప్రారంభమైంది.

కార్తీక్ రాజు (Karthik Raju), త్వరిత నగర్ (Twarita Nagar) జంటగా శుక్రవారం ఓ సినిమా మొదలైంది. ఇందులో అలీ, నందిని రాయ్, భద్రం తదితరులు ప్రధాన తారాగణం. దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంజీ రామ్ ద‌ర్శ‌కుడు. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాత. 

హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ గాయకుడు, నటుడు మ‌నో కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. ఆకాష్ పూరి (Akash Puri) గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిత్ర బృందానికి ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత భాస్క‌ర భ‌ట్ల స్క్రిప్ట్‌ అందించారు.

హైదరాబాద్ టు బ్యాంకాక్!
''మా సంస్థలో రెండో చిత్రమిది. తొలుత హైద‌రాబాద్‌ సిటీ, నగర శివార్లలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఆ తర్వాత బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35 నుంచి 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం'' అని నిర్మాత దండ‌మూరి అర‌వింద్ కుమార్ తెలిపారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రేకులు లేకుండా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినట్టు సాయి స్ర‌వంతి మూవీస్ అధినేత గొట్టిపాటి సాయి తెలిపారు.

News Reels

వాస్తవ ఘటనలు ఆధారంగా... 
''వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ల‌వ్‌, యాక్ష‌న్‌, క్రైమ్... అన్నీ ఉన్నాయి. మంచి డ్రామాగా రూపొందించాలని ప్లాన్ చేశాం. అనుదీప్ దేవ్ సంగీతం కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్ అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. మా చిత్రానికి మంచి టీమ్ కుదిరింది'' అని హీరో కార్తీక్ రాజు అన్నారు. తనకు ఈ సినిమాలో అవకాశం రావడం సంతోషంగా ఉందని హీరోయిన్ త్వ‌రిత న‌గ‌ర్ చెప్పారు. 

సోషల్ క్రైమ్ ఇష్యూస్ ఆధారంగా...
''ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సోష‌ల్ క్రైమ్ ఇష్యూస్ ఆధారంగా రాసుకున్న క‌థ‌. స్క్రిప్ట్ అద్బుతంగా కుదిరింది. న‌వంబ‌ర్ 14 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాల‌నేది ప్లాన్‌. హీరో కార్తీక్ రాజు క్యారెక్టర్ హైలైట్ కానుంది'' అని దర్శకుడు అంజీ రామ్ చెప్పారు. 

Also Read : సమంత 'యశోద'కు సాలిడ్ ఓపెనింగ్స్ - అమెరికా, ఆస్ట్రేలియాలోనూ అదుర్స్

కార్తీక్ రాజ్, త్వరిత నగర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అలీ, నందిని రాయ్, భద్రం తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : జె ప్రతాప్ కుమార్, కళ: మూసి ఫణి తేజ, మాటలు : ప్రబోధ్ దామెర్ల, ఛాయాగ్రహణం : ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: అనుదీప్ దేవ్, కథ - కథనం - దర్శకత్వం : అంజీ రామ్. 

Published at : 12 Nov 2022 01:18 PM (IST) Tags: Nandini Rai Tollywood Latest News Ali Karthik Raju Twarita Nagar Karthik Raju New Movie

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు