అన్వేషించండి

Japan Movie Making Video: ‘జ‌పాన్’ కోసం కార్తీ ఇంత కష్టపడ్డారా- ఆకట్టుకుంటున్న మేకింగ్‌ వీడియో

కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా 'జపాన్'. దీపావళి కానుకగా ఇవాళ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

Japan Movie Making Video: తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కార్తీ మూవీ వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆవారా’ తెలుగులో ఓ రేంజిలో సక్సెస్ అందుకున్నాడు కార్తీ.  తమిళంలోని ‘పయ్యా’ అనే పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు బాగా నచ్చేసింది. ఏకంగా 100 డేస్ ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత కార్తీకి తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది.

‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ

కార్తీ తాజాగా నటించిన సినిమా ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజమురుగన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుక‌గా ఈ చిత్రం నవంబరు 10న  విడుదల అయ్యింది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కార్తీ వేషం, యాస, నటన అన్నీ బాగున్నాయని సినీ అభిమానులు చెప్తున్నారు.

ఆకట్టుకుంటున్న ‘జపాన్’ మేకింగ్ వీడియో  

‘జపాన్’ విడుదలకు ముందు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.  ‘ది జర్నీ ఆఫ్ గోల్డెన్ స్టార్ జపాన్’ పేరుతో అభిమానుల ముందుకు తెచ్చింది. ఈ వీడియో చూస్తుంటే కార్తీ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డట్లు అర్థం అవుతుంది. ఆయన మేకోవర్ కోసం మేకప్ ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు. సినిమా కోసం వేసిన సెట్, షూటింగ్ కోసం మూవీ యూనిట్ పడిన శ్రమ అంతటినీ ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ‘జపాన్’ మూవీని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్

వరుస హిట్లతో ఫుల్ జోష్

కార్తీ ఇటీవల ‘విరుమాన్‌’, ‘సర్థార్‌’, ‘పొన్నియిన్‌సెల్వన్‌ 1’, ‘పొన్నియిన్‌సెల్వన్‌ 2’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ అద్భుత విజయాలను అందుకున్నాయి. కార్తీ కెరీర్ లో 25వ సినిమాగా ‘జపాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జపాన్‌’ మూవీ తనకు చాలా స్పెషల్ అని వెల్లడించారు. దర్శకుడు రాజుమురుగన్‌ స్టోరీ, డైలాగ్స్ తనకు చాలా నచ్చాయని చెప్పారు. ఈ చిత్రంలో తాను కనిపించనని, తన క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karthi Sivakumar (@karthi_offl)

Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Spirit: దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
Horror Thriller OTT : సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Survival Thriller OTT : ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget