అన్వేషించండి

Kamal Haasan: ‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ న్యూస్ - కమల్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారా?

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Kamal Haasan Roles In Thug Life Movie: విశ్వనటుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన ‘విక్రమ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా అద్భుత ఆదరణ దక్కించుకుంది. ఈ సూపర్ హిట్ తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు.   

గ్యాంగ్ స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్ గా కమల్ హాసన్

చాలా కాలం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే పేరు పెట్టారు. కమల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ‘థగ్ లైఫ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో వెల్లడించారు. “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ సాగిన గ్లింప్స్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమల్ సరికొత్త వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. టైటిల్స్ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.   

‘థగ్ లైఫ్’ మూవీలో కమల్ మూడు పాత్రలు!

ఇక ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేనున్నట్లు టాక్ వినిపించింది. రెండు సరికొత్త పాత్రలల్లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీలో కమల్ పాత్రలకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రలను లింక్ చేస్తూ మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ పది పాత్రల్లో ఆకట్టుకోగా, ఇప్పుడు మూడు పాత్రలో ఆహా అనిపించబోతున్నట్లు సమాచారం. మూడు పాత్రలు చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ‘విక్రమ్’ మూవీ తర్వాత అంతకు మించిన విజయాన్ని ఈ సినిమాతో అందుకోవాలని కమల్ భావిస్తున్నారట.  

‘థగ్ లైఫ్’ మూవీలో పలువు స్టార్ యాక్టర్లు

‘థగ్ లైఫ్’ సినిమాలో హీరోయిన్‍గా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. అయితే, రీసెంట గా ఈ మూవీ నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నట్లు టాక్ వినిపించింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  

Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget