Kalyanam Kamaneeyam Trailer Released: ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ వచ్చేసింది - సంక్రాంతికి కమనీయమైన టచ్
సంతోష్ శోభన్, ప్రియ భవాని శంకర్ నటిస్తున్న ‘కళ్యాణం కమనీయం’ సినిమా ట్రైలర్ విడుదల అయింది.

ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ఒక చిన్న సినిమా కూడా వస్తుంది. టైం బాగుంటే బ్లాక్‌బస్టర్ కూడా అవుతుంది. అలాగే ఈసారి కూడా ఒక చిన్న సినిమా రానుంది. అదే సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ నటిస్తున్న ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ నటి అనుష్క ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘హో ఎగిరే’, ‘ఓ మనసా’ పాటలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. సంక్రాంతి పెద్ద సినిమాలన్నీ విడుదల అయ్యాక జనవరి 14వ తేదీన ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేస్తున్నారు. అనిల్ కుమార్ ఆళ్ళ ‘కళ్యాణం కమనీయం’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూవీ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 12వ తేదీన, నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు తమిళ హీరోలు అజిత్, విజయ్ సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల కానున్నాయి. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ సినిమా కూడా జనవరి 14వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు.
యూవీ క్రియేషన్ బ్యానర్ పై సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో కూడా నటించారు. అదే బ్యానర్‌లో సంతోష్ శోభన్ నటిస్తున్న రెండో సినిమా ఇది. ఆయన నటించిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల సంతోష్ శోభన్ నటించిన ‘లైక్ షేర్ సబ్స్కైబ్’ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.
View this post on Instagram
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















