RRR Re-release In USA: అమెరికాలో మరోసారి ‘RRR‘ తుఫాన్, మార్చిలో 200 థియేటర్లలో రీరిలీజ్
జక్కన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR‘అమెరికా థియేటర్లలో మరోసారి సందడి చేయనుంది. మార్చిలో 200 థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది. బియాండ్ ఫెస్ట్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టియన్ పార్క్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా ప్రేక్షకులను ‘RRR‘ సినిమా మరోసారి అలరించనుంది. ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా మార్చి 3న 200 థియేటర్లలో విడుదల కానుంది. అన్ని చోట్లా ఈ సినిమా తెలుగులోనే విడుదల కాబోతుండటం విశేషం. వేరియెన్స్ ఫిల్మ్స్, బియాండ్ ఫెస్ట్, అమెరికన్ సినిమాథెక్, పొటెన్టేట్, సరిగమ సినిమాస్ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. మార్చి 1న లాస్ ఏంజిల్స్ లో ‘RRR‘ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ‘RRR ఫ్యాన్ CelebRRRation Live‘ ఈవెంట్ గా ఈ ప్రదర్శనను నిర్వహించనున్నారు. డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ఈ ఈవెంట్ జరుగుతుందని బియాండ్ ఫెస్ట్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టియన్ పార్క్స్ తెలిపారు. ఆ తర్వాత మార్చి 3న అమెరికా అంతటా ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. తాజాగా రీ రిలీజ్ కోసం చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
#RRR FINAL TRAILER
— Variance Films (@VarianceFilms) February 22, 2023
Let the CelebRRRation begin! S.S. Rajamouli's masterpiece #RRRMovie is roaring back to over 200 theaters nationwide starting March 3rd. Tickets and theater list here: https://t.co/VUSJeHFLGW #RRRforOscars @sarigamacinemas pic.twitter.com/5xtqbQFKjJ
ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూలు
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ‘RRR‘ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25, 2022న ఈ మూవీ విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను కొల్లగొట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ పోరాట యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. శ్రియ,అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో నటించారు.
‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక సినీ అవార్డులు
ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట అవార్డును అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. ఇప్పటికే ఈ పాటకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు దక్కింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డు అందుకుంది.
రాజమౌళిపై హాలీవుడ్ దర్శక దిగ్గజాల ప్రశంసలు
ఇక ‘RRR‘ సినిమాతో దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. హాలీవుడ్ దర్శక దిగ్గజాలు సైతం జక్కన్న ప్రతిభను మెచ్చుకుంటున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో స్టీవెన్ స్పిల్ బర్గ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ర్డు వేడుకలో జేమ్స్ కామెరూన్‌ను రాజమౌళితో మాట్లాడారు. ఆయన దర్శక నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. మరింత గొప్పగా చిత్రాలు తెరకెక్కించాలని ఆకాంక్షించారు.
Read Also: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?