News
News
వీడియోలు ఆటలు
X

Jersey Trailer 2: షాహిద్ కపూర్ 'జెర్సీ' కొత్త ట్రైలర్ చూశారా?

నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా కొత్త ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌ను సైతం ఆకట్టుకోవడంతో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన  గౌతమ్‌ తిన్ననూరి హిందీ 'జెర్సీ'కి కూడా దర్శకత్వం వహించారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో భారీ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ 'జెర్సీ' రీమేక్ లో కూడా నటించారు. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 31న విడుదల చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లే అప్పట్లో సినిమా ట్రైలర్ ను వదిలారు. అచ్చం తెలుగు సినిమా ట్రైలర్ మాదిరి మక్కీకి మక్కి దించేశారు. 

అయితే పాండమిక్ కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో మరో కొత్త ట్రైలర్ ను వదిలారు. ఇందులో సినిమాలో కీలక సన్నివేశాలను చూపించారు. దర్శకుడు గౌతమ్ రిస్క్ తీసుకోకుండా.. తెలుగులో తీసినట్లుగానే హిందీలో కూడా తీశారనిపిస్తోంది. అయితే ట్రైన్ దగ్గర హీరో అరిచే సీన్ లో నానిని చూసిన తరువాత షాహిద్ ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. 

ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం 47 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేశామని షాహిద్ అప్పట్లో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మృనాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కూడా నటించారు. సాచెట్, పరంపర సంగీతం అందించారు.

Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?

View this post on Instagram
 
A post shared by @dilrajuprodctns

Published at : 04 Apr 2022 02:18 PM (IST) Tags: shahid kapoor Mrunal Thakur Jersey Trailer 2 Jersey Release date

సంబంధిత కథనాలు

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?

Ram Charan Sharwanand : శర్వాకు చరణ్ కంగ్రాట్స్ - కొత్త జంటతో ఫోటోలు  

Ram Charan Sharwanand : శర్వాకు చరణ్ కంగ్రాట్స్ - కొత్త జంటతో ఫోటోలు  

Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..

Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?

7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!

7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!

టాప్ స్టోరీస్

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్