అన్వేషించండి

Jagadhatri Serial Today December2: కేదార్ పేపర్‌లో ఇచ్చిన ఫొటో యాడ్‌ శ్రీవల్లి చూసిందా..? కేదారే తన అన్న అని శ్రీవల్లికి తెలిసిపోయిందా..?

Jagadhatri Serial Today Episode Decmber2: తన చెల్లెల జాడ కోసం కేదార్ పేపర్‌లో ఇచ్చిన ఫొటో యాడ్‌ శ్రీవల్లి ఎక్కడ చూస్తుందేమోనని వైజయంతి కంగారుపడుతుంది. శ్రీవల్లి ఫొటో చూడకుండా పేపర్ కాల్చివేస్తుంది.

Jagadhatri Serial Today Episode: లోను అమౌంట్‌కు వడ్డీకట్టాలంటూ  కేదార్ తన పర్సులో నుంచి డబ్బులు తీసి వాళ్లకు ఇస్తాడు. ఆ పెద్దాయన వద్దు బాబు అని చెప్పినా  ఇవ్వబోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు...వచ్చి మేం అండగా ఉంటామని చెప్పడంతో  జగధాత్రి, కేదార్ ఎంతో సంతోషిస్తారు.

గొప్పలకు పోయి అప్పులు చేశానని..ఇప్పుడు ఇంద్రాణికి డబ్బులు ఇవ్వకపోతే...కౌషికి మొత్తం చెప్పేస్తోందని నిషిక మథనపడిపోతుంది.  ఈసారి కౌషికి విషయం తెలిసిందంటే...వేరే విధంగా ఉంటుందని భయపడిపోతుంది. ఇన్ని తెలిసి ఇంద్రాణి వద్ద డ‌బ్బులు ఎందుకు తీసుకున్నావని యువరాజు అంటాడు. నేను డబ్బులు తీసుకునేప్పుడు అవి ఇంద్రాణివి అని తెలియక తీసుకున్నాను అంటుంది. ఇంతలో మీనన్‌ యువరాజుకు ఫోన్‌ చేస్తాడు. వైజాగ్ పోర్టుకు ఓ పార్శిల్ వచ్చిందని...దాన్ని  హైదరాబాద్‌ శివారు వరకు నా మనుషులు తీసుకొస్తారని.. నువ్వు దాన్ని గోదాముకు చేర్చాలని చెబుతాడు. సిటీలో ఎలక్షన్‌ల వల్ల సెక్యూరిటీ  ఎక్కువగా ఉందని...కాబట్టి ఆ ఆర్డీఎక్స్‌ పార్శిల్‌ను  నువ్వే తీసుకుని రావాలని చెబుతాడు. ఇప్పుడిప్పుడే మా అక్క నన్ను నమ్ముతోందని...ఈ పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయలేనని అంటాడు. ఒక మూడు నెలలు నాకు సమయం ఇస్తే...మా అక్క కంపెనీ మొత్తం నా చేతుల్లో పెడుతుందని...అప్పుడు మీరు ఏం చెబితే అది చేస్తానని అంటాడు. ఇంతలో యువరాజు నుంచి ఫోన్‌ లాక్కుని మీనన్‌తో నిషిక మాట్లాడుతుంది. మా ఆయన నువ్వు చెప్పిన పనిచేస్తాడని...ఆయన చెయ్యకపోతే నేను చేస్తానని అంటుంది. మీనన్‌తో వ్యవహారం అంటే ప్రాణాలకే ప్రమాదమని యువరాజు  హెచ్చరిస్తాడు. ఇంట్లో ఇలా బయపడుతూ బతకడం కన్నా...అదే బెటర్‌ అని నిషిక అంటుంది.

పేపర్‌లో ఇచ్చిన యాడ్ చూడటం కోసం కేదార్‌ ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. ఇంతలో పేపర్‌ బాయ్‌ పేపర్ వేసి వెళ్తాడు. శ్రీవల్లి వెళ్లి ఆ పేపర్‌ తీసుకుని వస్తుంది. ఆ పేపర్‌ కేదార్ చేతికి ఇస్తుంది. తాను ఇచ్చిన యాడ్‌ కౌషికికి చూపిస్తాడు. మా అమ్మకు నేను కాకుండా  ఇంకో బిడ్డ కూడా ఉందని మాకు ఈ మధ్యనే తెలిసిందని కేదార్‌ వాళ్ల అక్క కౌశికితో చెబుతాడు. ఈ మాటలు విన్న వైజయంతి కొయ్యబారిపోతుంది. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందోనని నిషిక ఆమె వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో  శ్రీవల్లి కలుగజేసుకుని  ఈ యాడ్‌ చూసి వాళ్లు నీకు ఫోన్ చేస్తే...మీ చెల్లెని కానీ, తమ్ముడిని గానీ కలవచ్చు కదా అంటుంది.ఈ విషయం చెప్పగానే అందరూ  సంతోషంగా ఫీలవుతారు అనుకుంటే మీరంటే ఇంకా షాక్‌లోనేఉన్నారని జగధాత్రి అంటుంది. కేదార్‌కు నిజంగా  చెల్లెలు ఉండి ఉంటే వాళ్లు ఇన్నాళ్లు వెతక్కుండా ఉంటారా అని కౌషికి అంటుంది. ఈ విషయం వాళ్లకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదా వదినా అని జగధాత్రి బదులిస్తుంది.ఇంతలో  శ్రీవల్లి కౌషికిని పేపర్‌ అడుగుతుంది. కేదార్‌ వాళ్ల అమ్మను నేను కూడా చూస్తానంటుంది. శ్రీవల్లి పేపర్ తీసుకోగానే భయపడిపోయిన వైజయంతి తన చేతిలో ఉన్న దేవుడి హారతి పల్లెం కిందపడేసి అందరి దృష్టి మరల్చుతుంది. శ్రీవల్లిచేతిలో ఉన్న పేపర్ తీసుకుని హారతి మీద వేసి కాల్చివేస్తుంది. ఇది చూసి కేదార్ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. జగధాత్రి కల్పించుకుని మీరు పేపర్ కాల్చిపడేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తుంది. ఏదో  కంగారులో పడేశానులే అని తప్పించుకుని వెళ్లిపోతుంది...

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రాత్రి పూట క్రిష్‌ని ఇంటి నుంచి గెంటేసిన పద్మాక్షి! విహారికి తెలిసిన షాకింగ్ విషయం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రాత్రి పూట క్రిష్‌ని ఇంటి నుంచి గెంటేసిన పద్మాక్షి! విహారికి తెలిసిన షాకింగ్ విషయం!
Dharman: రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget