Naatu Naatu - Oscars: ‘ఆస్కార్’ అవార్డులను కొన్నారు - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎంతటి చారిత్రాత్మక విజయాలు సాధించినా ఎక్కడోచోట దాన్ని కూడా విమర్శించే వారు ఉంటారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట గురించే చర్చ. ఈ పాట ‘ఆస్కార్’ అవార్డుల నామినేషన్ లో చోటు దక్కించుకుందని తెలిసినప్పటి నుంచీ అందరి నోటా ఒకటే మాట. మన భారతీయ సినిమాకు ఆస్కార్ రావాలి అని. ఆ క్షణం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టుగానే అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్తూ ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను గెలుచుకుంది. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలను నిజం చేసి చూపించింది. దీంతో తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎంతటి చారిత్రాత్మక విజయాలు సాధించినా ఎక్కడోచోట దాన్ని కూడా విమర్శించే వారు ఉంటారు. అలాగే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం పట్ల కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ దీనిపై ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ పోస్ట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఆస్కార్ అవార్డుల వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు గునీత్ మోంగా తీసిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ కు కూడా ఆస్కార్ లభించింది. దీంతో దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఈ విజయాన్ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ ముత్తతిల్ ఎగతాళిగా చేస్తూ ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. భారతదేశంలో లాగానే మేకర్స్ అవార్డులను కొన్నారు అంటూ కామెంట్ చేశాడు. ఇది చాలా కామెడీగా ఉందని, ఇన్ని రోజులూ భారత దేశంలోనే అవార్డులను కొనగలమని అనుకున్నానని, కానీ ఇప్పుడు ఆస్కార్ ను కూడా కొంటున్నారని వ్యాఖ్యానించాడు. మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా పొందొచ్చు అంటూ విమర్శించాడు. షాన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ ప్రకటించింది. అంతర్జాతీయ వేదికపై ‘‘నాటు నాటు’’ పాట గురించి దీపికా చెప్పిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఆమె మాటల పట్ల భారతీయ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాటు నాటు’’ గురించి మూడు ముక్కల్లో భలే చెప్పింది అంటూ ప్రశంసించారు. ఆ వీడియోను అంతర్జాతీయ మీడియా కూడా చూపించింది. ఇలాంటి అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేడుకను భారతీయ అవార్డుల కార్యక్రమాలతో పోల్చినందుకు షాన్ పై మండిపడుతున్నారు. ఇక ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ ప్రదర్శనతో ఆస్కార్ వేదిక దద్దరిల్లింది.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమా నేపథ్యం మొత్తం భారతదేశానికి స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథలా చూపిస్తుంది. ఇందులో బ్రిటిష్ వారి పాలనను ఎదురించే పాత్రలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కనిపించారు. గిరిజన నాయకుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్, పోలీసు అధికారి అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ లు కలసి చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకున్ని కట్టిపడేస్తాయి. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ తదితన నటీనటులు కీలక పాత్రలలో కనిపించారు.
Also Read : రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా