Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి
రాకింగ్ రాకేష్, సుజాత ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆన్ స్క్రీన్ జోడీగా నటించి రియల్ లైఫ్ ప్రేమికులుగా మారిన ఈ జంట, త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
![Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి Jabardasth Fame Rocking Rakesh Anchor Jordar sujatha got engaged, check details Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/27/968a6c60ad97f3759ca9e1201208042b1674814948496544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు రాకింగ్ రాకేష్. చక్కటి కామెడీ టైమింగ్, ఆకట్టుకునే హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తన పంచుల పటాసులతో తక్కువ టైమ్ లో టీమ్ లీడర్ అయ్యాడు. జోర్దార్ సుజాత సైతం బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంది. చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాకేష్ టీమ్ ద్వారా ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరి స్కిట్లు బాగా పేలాయి కూడా. ప్రేక్షకులకు చక్కటి కామెడీ అందించడంతో ఈ జంట బాగా పాపులర్ అయ్యింది.
పరిచయం.. ప్రేమ.. పెళ్లి!
కొంత కాలం జబర్దస్త్ ప్రయాణం కొనసాగించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది. ఒకరికి ఒకరు ఇష్టం కావడంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి బోలెడన్నీ వీడియోలు వైరల్ అయ్యాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ తాజాగా వీరిద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. బంధు మిత్రుల సమక్షంలో నూతన వధూవరులు నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి డేట్ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చూడచక్కని జంట అంటూ కొనియాడుతున్నారు.
View this post on Instagram
నిశ్చితార్థ వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు
మరోవైపు ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. బుల్లితెర, వెండి తెర నటీనటులు ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ మంత్రి రోజా, యాంకర్ అనసూయ, యాంకర్ రవి, జబర్దస్త్ షో కమెడియన్లు గెటప్ శ్రీను, చలాకి చంటి, అదిరే అభి సహా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. మరికొందరు బుల్లితెర స్టార్లు సైతం వీరి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొన్నారు.
View this post on Instagram
View this post on Instagram
Read Also: లోకేష్ కనగరాజ్‌ను ఏ తెలుగు నిర్మాత నమ్మలేదు - ‘విక్రమ్’ దర్శకుడిపై సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)