అన్వేషించండి

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

కొంతకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ కొత్త జంట.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో అనేక రూమర్లకు కారణమైంది.

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొద్ది నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతున్న వీరిద్దరు..  ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు టాప్ స్టార్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.   

వెడ్డింగ్ తర్వాత ఈ జంట ఏమాత్రం సమయం దొరికినా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా దుబాయ్ వేదికగా జాలీగా గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివన్ బర్త్ డే కావడంతో నయనతార ఈ వేడుకను స్పెషల్ గా అరేంజ్ చేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ముందు బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడకులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు విఘ్నేష్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఈ జంట కొంత మంది పిల్లలతో ఫోటోలు తీసుకున్నారు. వీటిలో ఓ ఫోటోను విఘ్నేష్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు.  

ఈ తాజాగా ఫోటోలో పిల్లలు ఎంతో సంతోషంగా నవ్వుతున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విఘ్నేష్ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. “కొంతమంది పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నాం. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేయాలి కదా” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందని ఊహాగానాలు వస్తున్నాయి. అదే విషయాన్ని విఘ్నేష్ తన పోస్టుతో చెప్పారని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ఊహాగానాలపై విఘ్నేష్, నయనతారలు స్పందించలేదు.

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

తాజాగా ఈ నూతన జంటకు సంబంధించిన పెళ్లి వేడుక టీజర్ విడుదల అయ్యింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఈ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు నయనతార పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. పెళ్లి సందర్భంగా.. తాళికట్టే కొన్ని ఫోటోలను నయనతార, విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నయనతార విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుకల రైట్స్ ను నెట్ ఫిక్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసింది.  వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ భారీగా ఖర్చుపెట్టి ఘనంగా నిర్వహించింది. ఈ పెళ్లి వేడుకను ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో చిత్రీకరించింది. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ వేడుకను స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీ టీజర్‌ ను విడుదల చేశారు. ఇందులో నయనతార విఘ్నేష్‌ శివన్‌ల పరిచయంలోని మధుర ఘట్టాల్ని రూపొందించారు. ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. అటు ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ కానుంది.

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget