ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన 'ప్రాజెక్టు కె' మూవీ టీమ్. హర్ట్ అయిన ఫ్యాన్స్ ?
వైజయంతి మూవీస్ ప్రబాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వరుసగా టపాసులు పేలుతుంటే ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది.
హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ లు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్టు కె సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురు చేస్తోన్న ఫ్యాన్స్ కు ప్రాజెక్టు కె మూవీ టీమ్ కొత్త అప్డేట్ ను అందించినంది. ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మూవీ కి సంబంధించిన పోస్టర్ ను రీలీజ్ చేసింది. అటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నుంచి కూడా రాముడిగా ప్రభాస్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపారు మూవీ టీమ్.
అంతకంటే ముందే ప్రాజెక్టు కె ను నిర్మిస్తోన్న వైజయంతి మూవీస్ ప్రబాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వరుసగా టపాసులు పేలుతుంటే ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది. అంటే ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. అది వచ్చిన కాసేపటికే పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. దానిమీద హీరోలు పుట్టరు పెరుగుతారు, తయారవుతారు అని రాస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది మూవీ టీమ్. అందులో ఆ పోస్టర్ చూస్తుంటే ఎదో ఐరన్ మ్యాన్ సినిమా పోస్టర్ లాఉందంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. దీంతో ఇందులో ప్రభాస్ ఏదైనా సూపర్ హీరోలా నటించబోతోన్నాడా? అనే అనుమానాలు ఉన్నాయి.
మొత్తం మీద పోస్టర్ ను చూసిన అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు కె నుంచి వచ్చిన వీడియో, పోస్టర్ లో అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి లేకపోవడంతో ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు వెయిట్ చేయించాలా అన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అసలే మొన్న ఆదిపురుష్ టీజర్ పై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. అందులో ఉన్న గ్రాఫిక్స్ చూసి ఇదేం గ్రాఫిక్స్ అంటూ విమర్శించారు. దీంతో మూవీ టీమ్ దానికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టు కె నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా కొంత అప్సెట్ చేసేలా ఉండటంతో మూవీ టీమ్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రాజెక్టు కె నుంచి వచ్చిన అప్డేట్ లో ఆ ఐరన్ మ్యాన్ చేయి తప్ప ఇంకేముంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించి ఇలాంటివి కాకుండా కాస్త కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. ఇక ప్రాజెక్ట్ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్. భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.