By: ABP Desam | Updated at : 11 Jan 2023 10:55 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@goldenglobes/twitter
భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరెక్కించిన చిత్రం ‘RRR’. దేశ విదేశాల్లోనూ సంచనల విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో అవార్డులను దక్కించుకున్నది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ అవార్డును అందుకుంది. 2 కేటగిరీల్లో అవార్డు కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలోనూ అవార్డు కోసం పోటీ పడింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’ అవార్డును దక్కించుకుంది. ఆ పాటకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి ఆ అవార్డును అందుకున్నారు.
Your song "Naatu Naatu" just won Best Orignal Song 🎶 Huge congratulations, @mmkeeravaani @rrrmovie. #GoldenGlobes
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023
🎥 @davemalave pic.twitter.com/8zdjKKewb0
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ‘RRR’కు నిరాశ
అటు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో మాత్రం ‘RRR’కు నిరాశ ఎదురయ్యింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘అర్జెంటీనా1985’ గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో మొత్తం 5 సినిమాలు నామినేట్ అయ్యాయి. ‘RRR’తో పాటు జర్మనీకి చెందిన ‘ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’, అర్జెంటీనాకు చెందిన ‘అర్జెంటీనా 1985’, బెల్జియంకు చెందిన ‘క్లోజ్’, సౌత్ కొరియాకు చెందిన ‘డిసిషన్ టు లీవ్’ చిత్రాలు పోటీపడ్డాయి.ఇందులో ‘RRR’ విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, ‘అర్జెంటీనా1985’ను అవార్డు వరించింది. అర్జెంటీనాలోని సైనిక నియంతలపై ఓ లాయర్ల బృందం తిరగబడిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
So excited to see Argentina, 1985 win for Best Motion Picture - Non-English Language tonight! 💛
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023
Watch the #GoldenGlobes LIVE on NBC and Peacock! pic.twitter.com/bFw56UfrkO
ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’
ఇక 2022 మార్చి 24న విడుదలైన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది. స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్ అద్భుతంగా నటించి మెప్పించారు. జపాన్ లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
అస్కార్స్ కు ఎంట్రీ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులు!
నిజానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అనేవి ఆస్కార్ కు పునాదిగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్ ను సైతం అందుకుంటాయి. ఈ నేపథ్యంలో ‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అస్కార్ అవార్డ్స్ వేదికపైనా సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు. కాగా, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి తాజాగా బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఇక ఆస్కార్స్ లోనూ అవార్డును అందుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ అవార్డుల వేదికపై తెలుగు దర్శకుడు సత్తా చాటాలని ఆశిస్తున్నారు.
Keerthy Suresh: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!
Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!
Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>