అన్వేషించండి
Ranveer Singh's Trend: రణవీర్ ట్రెండ్ ఫాలో అవుతోన్న హీరోలు - మొన్న విష్ణువిశాల్, ఇప్పుడు నందు!
రణవీర్ సింగ్ మాదిరి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మన హీరోలు.

రణవీర్ ట్రెండ్ ఫాలో అవుతోన్న హీరోలు
రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ ఫొటోషూట్ పై కొందరు ప్రశంసలు కురిపించగా.. మరికొందరు మాత్రం రణవీర్ ని బాగా ట్రోల్ చేశారు. ఏదైతేనేం.. ఈ ఫొటోలైతే ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు మన హీరోలు. రణవీర్ సింగ్ మాదిరి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే విష్ణు విశాల్ ఇలాంటి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బెడ్ పై పడుకొని దుప్పటి కప్పుకొని ఉన్న విష్ణు ఫొటోలను అతడి భార్య గుత్తా జ్వాలా తీసిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ను గీతామాధురి భర్త నందు కూడా ఫాలో అయ్యారు. రణవీర్ సింగ్ ట్రెండ్ లో జాయిన్ అవుతున్నానంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.
పూర్తి నగ్నంగా కాకుండా.. టవల్ కట్టుకొని నిలబడ్డారు నందు. తన సిక్స్ ప్యాక్ ను చూపిస్తూ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇక నందు సినిమాల విషయానికొస్తే.. రష్మీ గౌతమ్ తో అతడు కలిసి నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాపై అప్డేట్ రాలేదు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
అమరావతి
తిరుపతి
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion