Gangubai Kathiawadi trailer: లేడీ డాన్ గెటప్ లో అలియా, 'గంగూబాయి' ట్రైలర్ చూశారా?
తాజాగా 'గంగూబాయి కథియావాడి' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) నటించిన లేటెస్ట్ సినిమా 'గంగూబాయి కథియావాడి'(Gangubai Kathiawadi). సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన మాఫియా క్వీన్ గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లేడీ డాన్ గెటప్ లో సీరియస్ గా కనిపిస్తూనే.. మరోపక్క ఫన్ చేసే ప్రయత్నం చేసింది. 'కామాటిపురలో అమావాస్య రోజు కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే వేశ్య గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందనేదే ఈ సినిమా. అలియా భట్‌తో పాటు ట్రైలర్‌లో విజయ్ రాజ్, జిమ్ సర్భ్ కీలక పాత్రలలో కనిపించారు. అజయ్ దేవగన్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చారు. ట్రైలర్‌లో అజయ్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించినప్పటికీ సినిమాలో ఆయన పాత్ర కీలకమని తెలుస్తోంది. S. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. SLB భన్సాలీ ప్రొడక్షన్స్ అండ్ జయంతిలాల్ గడాస్ పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
View this post on Instagram