అన్వేషించండి

Salaar Teaser: ‘సలార్’ టీజర్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి - ప్రశాంత్ నీల్‌పై ఫైర్, ఎందుకంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మాస్ ఎలివేషన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’ టీజర్ రిలీజైంది. అయితే...

Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మాస్ ఎలివేషన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ చూసి చాలా రోజులైన నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. టీజర్ లో ప్రభాస్ మాస్ లుక్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ‘ఇది కదా ప్రభాస్ నుంచి మాకు కావాల్సింది’ అంటూ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ వైపు టీజర్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం టీజర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అదరగొట్టిన ‘సలార్’ టీజర్..

ఇక ‘సలార్’ టీజర్ విషయానికొస్తే.. ఓ రౌడీ గ్యాంగ్ చుట్టుముట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా టీనూ ఆనంద్ డైలాగ్‌ తో టీజర్‌ ప్రారంభం అయింది. "లయన్, చిరుత, టైగర్, ఏనుగు, ఇవన్నీ చాలా ప్రమాదం కానీ, జురాసిక్‌ పార్క్‌ లో కాదు. ఎందుకుంటే ఆ పార్కులో..’ అని అంటుండగానే రెబల్ స్టార్ టైటిల్ తో ప్రభాస్ మాస్ కటౌట్ ను చూపించారు. ఈ టీజర్ కూడా కేజీఎఫ్ తరహా ఎలివేషన్స్ నే ఇచ్చాడు ప్రశాంత్ నీల్. చాలా పవర్‌ఫుల్‌ గానే టీజర్ ను కట్ చేశారు మేకర్స్. పిడికిలి బిగించి ప్రభాస్ నిల్చున్న సమయంలో ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్ రావడం మాత్రం పక్కా. విజువల్ ట్రీట్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయనే చెప్పాలి. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు మాస్ బిర్యానీ లాంటి ట్రీట్ అనే చెప్పొచ్చు.

టీజర్ పై అసంతృప్తి ఎందుకు?

ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సమయం ఇది. ఒక హై అండ్ మాస్ యాక్షన్ కటౌట్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ‘సలార్’ టీజర్ సరిగ్గా అలాంటి ట్రీట్ నే ఇస్తుందని అనుకున్నారు. వాస్తవానికి టీజర్ ఓ రేంజ్ లో ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇంతకన్నా ఎక్కువే కోరుకున్నారు. టీజర్ లో ప్రభాస్ ఫేస్ ను చూపించకపోవడం అలాగే హీరో కు ఎలాంటి డైలాగ్ లు లేకపోవడంతో కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ‘ఇది టీజర్ నా లేక గ్లింప్స్ నా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి ఒక మాస్ ఎలివేషన్ టీజర్ వస్తుంటే ఫేస్ చూపించలేదేంది’ అంటూ మరొక అభిమాని కామెంట్ చేశాడు. అన్నీ బానే ఉన్నా ప్రభాస్ ఫేస్ చూపించకపోవడం అభిమానులకు కాస్త మింగుడు పడని వార్తలానే అనిపిస్తోంది. ఏదైమైనా టీజర్ మాత్రం ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. మరి తర్వాత వచ్చే ట్రైలర్ లో అయినా ప్రభాస్ ను ఎలా చూపిస్తారో చూడాలి.

‘సీస్ ఫైర్’ అంటే ఏమిటి?

ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘సలార్’ సినిమాను వివిధ పార్ట్ లుగా తీస్తున్నారని ముందు నుంచే వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగానే టీజర్ చివర్లో పార్ట్ 1 సీస్ ఫైర్ అని రాసుకొచ్చారు. పార్ట్ 1 వరకూ ఓకే అసలు ఈ సీస్ ఫైర్ అంటే ఏమిటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. సీస్ ఫైర్ అనేది యుద్ద సమయంలో శాంతి కోసం కుదుర్చుకునే ఒక ఒప్పందం లాంటిది. ఏదైనా యుద్దంలో కాల్పులు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఆ సమయంలో శాంతి గురించి చర్చలను అనుమతించడం కోసం రెండు సైన్యాల మధ్య కుదుర్చుకునే ఒప్పందం పేరే సీస్ ఫైర్. టీజర్ చివర్లో పార్ట్ 1 సీస్ ఫైర్ అని రాసుకొచ్చారు మేకర్స్. మరి దీన్ని సినిమాలో ఏ విధంగా చూపిస్తారో చూడాలి. 

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న 'సలార్' 

'సలార్' విడుదలకు ఇంకెన్నో రోజులు లేదు. సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: మహాభారతం స్ఫూర్తితో త్రివిక్రమ్ - బన్నీ సినిమా? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar Arjun Rampal: రిషబ్ శెట్టి 'ఛత్రపతి శివాజీ మహారాజ్'లో... 'ధురంధర్ 2' మేజర్ ఇక్బాల్ ఎంట్రీ!
రిషబ్ శెట్టి 'ఛత్రపతి శివాజీ మహారాజ్'లో... 'ధురంధర్ 2' మేజర్ ఇక్బాల్ ఎంట్రీ!
Rakasa Snake Dance Song : రాకాస స్నేక్ డ్యాన్స్ సాంగ్ - పార్టీ జోష్ పెంచే స్టెప్పులు... షేక్ చేసే లిరిక్స్
రాకాస స్నేక్ డ్యాన్స్ సాంగ్ - పార్టీ జోష్ పెంచే స్టెప్పులు... షేక్ చేసే లిరిక్స్
Nindu Manasulu Serial Today March 21st: నిండు మనసులు: రాజశేఖరానికి ఇచ్చి పడేసిన సిద్ధూ! అంతా కావాలనే చేశానని కుమిలిపోతున్న ప్రేరణ తండ్రి!
నిండు మనసులు: రాజశేఖరానికి ఇచ్చి పడేసిన సిద్ధూ! అంతా కావాలనే చేశానని కుమిలిపోతున్న ప్రేరణ తండ్రి!
Dhurandhar 2 Collections: బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
SBI FD Rates Hiked: స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
Dhurandhar 2 Collections: బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Ustaad Bhagat Singh Collections - 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
Embed widget