అన్వేషించండి

Ennenno Janmalabandham September 19th: మాజీ భార్యతో యష్, ముక్కలైన వేద మనసు - ఫంక్షన్ లో రణరంగం సృష్టించేందుకు సిద్ధమైన మాళవిక

వసంత్, నిధిల ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తాడు యష్. ఆ ఫంక్షన్ ఎలాగైనా చెడగొట్టాలని మాళవిక ప్లాన్ వేస్తుంది.

వసంత్ కూడా మాళవిక అభిమన్యులని చూసి కోపంగా వాళ్ళ దగ్గరకి వెళతాడు. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వసంత్ కోపంగా అడుగుతాడు. నీ కోసమే వచ్చామని మాళవిక అంటే నేనేమీ మిమ్మల్ని పిలవలేదు కదా అని వసంత్ అంటాడు. నువ్వు పిలిచిన పిలవకపోయినా బంధం విలువ తెలుసు కాబట్టి బాధ్యతతో వచ్చాను అని మాళవిక చెప్తుంది. బాధ్యతలు మర్చిపోయి నువ్వు చాలా రోజులు అయిందని వసంత్ అంటే గెస్ట్ లతో ఇలాగేనా బిహేవ్ చేసేది అని అభి అంటాడు. అభి, మాళవికకి యష్ హాయ్ చెప్పి ఫంక్షన్ కి ఆహ్వానిస్తాడు. వాళ్ళు దామోదర్ గాఋ గెస్ట్ లుగా వచ్చారు మనం ఎం మాట్లాడకూడదు అని యష్ చెప్తాడు.

అది చూసి వేద బాధపడుతుంది. సులోచన వచ్చి ఎన్నాళ్ళు ఇలా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఆ మాళవిక నీ జీవితంలోకి నీకు, నీ భర్తకి మధ్యలో వస్తుంది. అది చూసి నువ్వు లోలోపల ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసని సులోచన బాధగా అంటుంది. నాకెందుకుమ్మా బాధ అమ్మ అని పిలిపించుకుంటున్నా కదా నాకు అది చాలని వేద కవర్ చేసేందుకు చూస్తుంది. 'నువ్వు నాకు చెప్పకపోయినా నీలో ఒక బాధ, వెలితి, తపన ఉన్నాయని నాకు తెలుసు. భార్య స్థానం కోసం నువ్వు ఆరాటపడుతున్నావ్ కానీ నీకు వ్యతికరేకంగా కుట్ర జరుగుతుంది. ఎందుకు ఊరుకుంటున్నావ్. నువ్వు నువ్వెందుకు కాపాడుకోవడం లేదు. ఖుషి తల్లి మాత్రమే అయితే సరిపోదు, యశోధర్ కి భార్యవి కావాలి. ఒక ఆడది ఏ విషయంలో అయినా రాజీ పడొచ్చు కానీ ఒక్క భర్త విషయంలో తప్ప. ఖుషి నీ కూతురు, యశోధర్ నీ భర్త. ఖుషి మాత్రమే నీ సొంతం కాదు.. యశోధర్ కూడా నీ సొంతమే. నీ హక్కుని నీకు దూరం చేస్తాను అంటే ఎందుకు ఊరుకుంటున్నావ్ ఎలా ఊరుకుంటున్నావ్? అమ్మగా మాత్రమే కాదు భార్యగా కూడా నువ్వు గెలవాలి' అని హితబోధ చేస్తుంది.

Also Read: బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత,దీప చేతిరాత గుర్తుపట్టిన శౌర్య - వంటలక్క ఏం చేయబోతోంది!

చిత్ర మెహంది బాగా పండిందా అని వసంత్ కు చూపిస్తుంది. కొంచెం త్వరగా రావచ్చు కదా యష్ సర్ వచ్చి చక్కగా వేద అక్కకి మెహంది పెట్టారు. పెళ్లి అయిన తర్వాత ఒక్క క్షణం కూడా నిన్ను నేను మిస్ అవ్వను. నువ్వు కూడా నన్ను మిస్ అవకూడదు అని వసంత్ చెయ్యి పట్టుకుంటే తను మాత్రం దూరంగా విడిపించుకునేందుకు చూస్తూ ఉంటాడు. అది దూరం నుంచి చూసి వేద అగ్రహారం కమాండోస్ అని వాళ్ళ అక్క, అమ్మ, బావకి ఫోన్ చేసి ఒక దగ్గరకి రమ్మని చెప్తుంది. ఎదురుగా వసంత్, నిధిలని వాళ్ళకి చూపించి చిత్రని పిలిపించే టైమ్ వచ్చిందన్నమాట అని చిత్రని పిలిపిస్తారు.

వేద వాళ్ళ బావ చిత్ర, వసంత్ ని చూసే విధంగా చేస్తాడు. నిధిని పక్కకి తప్పించి చిత్రని చూసేలా చేస్తాడు. అప్పుడే యష్ అక్కడికి వచ్చేస్తాడు. చిత్ర, వైభవ్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తారు. అది చూసి వసంత్ కాస్త ఇబ్బంది పడతాడు. బాగా ఉషారుగా ఉన్నావ్ గా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని యష్ వైభవ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. మాళవిక చిత్ర, వసంత్ మీద కన్నేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇష్టం లేనట్టు మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లం ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఆ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుంటే ఈ ఫంక్షన్ రణరంగం అవుతుందని మాళవిక అభితొ చెప్తుంది. తెలివిగా తెలుసుకుంటాను అంటే దామోదర్ దగ్గరకి వెళ్ళి మాటలు కలిపి మేటర్ తెలుసుకుందాం, ఒక చిన్న హింట్ దొరికినా మిగిలిన కథ అల్లుకోవడం కష్టం ఏమి కాదు వెళ్ళి మాట్లాడు అని అభి మాళవికని పంపిస్తాడు.

Also Read: అడ్డుతప్పుకో వసుధార అని రిషి ఆగ్రహం, జగతి-మహేంద్ర పెళ్లిరోజు వేడుకలో ఏం జరిగింది!

నిధి, వసంత్ పెయిర్ చాలా బాగుంది. వాళ్లిద్దరికి ఇష్టమేనా అభిప్రాయం తెలుసుకున్నారా అని మాళవిక దామోదర్ ని అడుగుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వేద గమనిస్తూ ఉంటుంది. జనవరిలో సంక్రాంతి పండగకి హైదరాబాద్ వచ్చినప్పుడు యష్, వేద కలిశారని దామోదర్ చెప్పేసరికి మాళవిక వెంటనే పెళ్లి కాకుండానే వేదని భార్యగా పరిచయం చేశాడని అనుకుంటుంది. యష్ మీకు అబద్ధం చెప్పాడని మాళవిక చెప్తుంది. 'యష్ మీకోక పర్ఫెక్ట్ పిక్చర్ చూపించాడు. యష్, వేద, ఖుషి హ్యాపీ ఫ్యామిలీ అని చూపించాడు. నిజం ఏమిటంటే ఆ ఫ్యామిలీ నాది. ఖుషి వేద కూతురు కాదు నా కూతురు. నేను యష్ ఎక్స్ వైఫ్ ని, మేమిద్దరం డివర్స్ తీసుకున్నా వేదతో కలిసి ఉంటున్నా యష్ ఇప్పటికీ నన్నే లవ్ చేస్తున్నాడు. కేవలం నన్ను మాత్రమే' అని మాళవిక చెప్తుంది.

దామోదర్ నవ్వుతూ నైస్ స్టోరీ మాళవిక గారు వినడానికి చాలా బాగుందని అంటాడు. కానీ మీ లవ్ స్టోరీలో ఒక లూప్ హోల్ ఉంది. యష్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అనేదని అంటాడు. కాదని మీకు ఎలా తెలుసని మాళవిక అంటే యష్ చెప్పాడు కాబట్టి, నా కారణంగానే యష్, వేద దగ్గర అయ్యారు. అప్పుడే తన కథ నాకు చెప్పాడని దామోదర్ చెప్తాడు. యష్ గతం చెప్పాడు కానీ గుండెల్లో మాట మీకు తెలియదని అంటుంది. వాళ్ళ మాటలు అన్నీ వేద వింటూనే ఉంటుంది. యష్ కి వేదలాంటి మంచి వైఫ్ దొరికిందని మెచ్చుకుంటాడు. మీరు కూడా అభితో ఉంటున్నారని తెలిసింది సొ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటే మంచిదని చెప్పి వెళ్ళిపోతాడు.

తరువాయి భాగంలో..

యశోధర్ కి నీ మీద ప్రేమ లేదు వేద అని మాళవిక అంటుంది. ఆ ప్రేమ నా మీదే ఉంది.. ఇప్పటికీ యశోధర్ నన్నే కావాలని అనుకుంటున్నాడు అని మాళవిక వేదతో చెప్తుంది. అప్పుడే యష్ వస్తే నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు నా మీద ప్రేమ లేదా అని యష్ ని అడుగుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABPKKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget