అన్వేషించండి

They Call Him OG: సల్మాన్ ఖాన్ తర్వాత పవన్‌తోనే - తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ హీరో!

పవన్ కళ్యాణ్, సుజీత్‌ల ‘ఓజీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిని ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపిక చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలన్నిటిలో ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది ‘ఓజీ’నే. సినిమా ప్రకటన నాటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ ఈ సినిమా వార్తల్లో ఉంటూనే వస్తుంది. ఇప్పుడు ‘ఓజీ’ నుంచి మరో కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి ‘ఓజీ’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’లో విలన్‌గా నటిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఆయన రెండో సినిమా ‘ఓజీ’ కానుంది.

ఇటీవలే కోలీవుడ్ క్రేజీ యాక్టర్ అర్జున్ దాస్‌ను కీలక పాత్రకు ఎంపిక చేశారు. మరో ప్రముఖ తమిళ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి కూడా ఇందులో కనిపించనున్నారు. ఈ సంవత్సరం చివర్లో కానీ, 2024 ప్రారంభంలో కానీ ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత ఈ సినిమాకే ఇచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని, మూడో షెడ్యూల్ కూడా శరవేగంగా సాగుతుంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. 2011లో వచ్చిన ‘పంజా’ తర్వాత పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలో నటించడం ఇదే మొదటి సారి. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్, క్రిష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’లో కూడా బాలీవుడ్ నటుడే ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నారు. బాబీ డియోల్‌తో పవన్ కళ్యాణ్ ఢీకొట్టనున్నారు. మొదట ఈ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన తప్పుకున్నారు. అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్‌ను తీసుకున్నారు. మొగలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు.

పవన్ కళ్యాణ్ 'వారాహి' యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో 'ఓజీ' సహా మిగతా సినిమా షూటింగులకు బ్రేక్ వస్తుందని కొందరు భావించారు. అయితే, అటువంటి సందేహాలకు పవన్ & దర్శక, నిర్మాతలు చెక్ పెట్టారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగులకు టైమ్ కేటాయిస్తానని పవన్ చెప్పడంతో ఏపీలో షూటింగులు జరగనున్నాయి. జూన్ తొలి వారంలో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులు షూటింగ్స్ చేశారు. 

'ఓజీ' చిత్రానికి పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబైలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఆయన కూడా షూటింగులో జాయిన్ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget